సూర్యపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Actor Suriya Words On NEET No Contempt Says Madras High Court - Sakshi

చెన్నై: తమిళ నటుడు సూర్యపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబోమని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తెలిపింది. నీట్‌ పరీక్షల నిర్వహణను ఉద్దేశించి సూర్య న్యాయమూర్తులను కించపరిచే విధంగా ట్వీట్లు చేశాడనే వాదనలపై ఈమేరకు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సూర్య వ్యాఖ్యలు అనవసరమైన, సమర్థనీయం కానివని పేర్కొంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రజా స్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోందని వెల్లడించింది. తమ పనితీరును తక్కువ చేసి మాట్లాడటం తగదని హితవు పలికింది. కాగా, నీట్‌ పరీక్షల నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
(చదవండి: దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!)

ఈ ఘటనపై నటుడు సూర్య స్పందిస్తూ.. ‘విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసింది. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలిస్తున్నారు. విద్యార్థులను మాత్రం భయం లేకుండా పరీక్షలు రాయమని ఆదేశిస్తారు’అని ట్వీట్లు చేశారు. దీంతో వివాదం రాజుకుంది. సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్‌ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. న్యాయమూర్తుల నైతికతపై సూర్య ట్వీట్లు చేశారని పేర్కొన్నారు. అయితే, తమిళంలో ఉన్న ట్వీట్లను అన్వయం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని, సూర్య ట్వీట్లలో నైతికత అన్న పదమే లేదని కొందరు వాదిస్తున్నారు.
(చదవండి: నీట్‌పై వ్యాఖ్యలు : చిక్కుల్లో హీరో సూర్య)

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top