రెవెన్యూ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

వేలూరు: రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామీణ సిబ్బందుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తమిళనాడు రెవెన్యూ గ్రామీణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరుమలైవాసన్‌ డిమాండ్‌ చేశారు. వేలూరులోని టౌన్‌ హాలులో ఆ సంఘ రాష్ట్ర మూడవ మహానాడు జిల్లా అధ్యక్షులు ఆదికేశవన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సహాయకులకు నిర్ణీత కాల పరిమితితో కూడిన వేతన శ్రేణిని అమలు చేయాలని, తమను గ్రూప్‌ డీలో చేర్చాలని, విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సీనియారిటీ ప్రకారం ప్రదోన్నతులు కల్పించాలని తదితర డిమాండ్‌లు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ మహానాడులో పలు తీర్మానాలను సభ్యులు తీర్మానించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి శరవణన్‌, కోశాధికారి ఆసైతంబి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement