కొరుక్కుపేట: వెండి కేడెముపై శ్రీ వాసవాంబ కొలువై భక్తులను కటాక్షించారు. చైన్నెలోని 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 22 నుంచి వడాయతి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా శనివారం శ్రీ వాసవాంబను వెండి కేడెముపై విశేషంగా అలంకరించి పూజలు చేశారు . భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ ఉత్సవంలో సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో గురువు ప్రియాబాంధవి సమక్షంలో నాట్య ప్రసాద బృందం నాట్యప్రదర్శన అందరినీ మంత్రముగ్దులను చేసింది.


