సాక్షి, చైన్నె: పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చైన్నె డీజీపీ కార్యాలయం ఆవరణలోని స్మారకం వద్ద సీఎం విజయ్ గౌరవ వందనం సమర్పించారు. అక్కడ ఉంచి అమరులైన వారి చిత్ర పటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. 1959లో లడఖ్ సరిహద్దులో చైనా దళాల ఆకస్మిక దాడిలో వీరమరణం పొందిన 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాలను, అలాగే విధుల్లో ప్రాణాలర్పించిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కాగా విధి నిర్వహణలో మరణించిన ఆరుగురు పోలీసుల కుటుంబాలు, కోమాలో ఉన్న మరో పోలీసు కుటుంబానికి కలిపి మొత్తం 7 కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య , వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద రూ. 5 కోట్ల 96 లక్షల విలువైన చెక్కులు, ఉత్తర్వులను సీఎం అందజేశారు. అమరులై పోలీసుల పిల్లలను ఎత్తుకుని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో హోమ్, ప్రొహిబిషన్ , ఎకై ్సజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ. కార్తీక్, డిజిపి మహేష్ కుమార్ అగర్వాల్, చైన్నె నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ. అమల్‌రాజ్ తదితర ఉన్నతాధికారులు, పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పోలీసు సేవలపై అభినందనలు వివిధ క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు చూపే అంకితభావం సీఎం విజయ్ ప్రశంసించారు.


