నీటి ట్యాంకులో మునిగి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటి ట్యాంకులో మునిగి వ్యక్తి మృతి

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

– సెల్‌ఫోన్‌ తీయడానికి యత్నిస్తుండగా ఘటన

అన్నానగర్‌: కాంచీపురం జిల్లా, ఒరగడం సమీపం మైయాల్‌ పాణాచ్చేరి గ్రామానికి చెందిన నాగభాసన్‌ (60). ఇతను చెంగల్పట్టు జిల్లా, ఆప్పూర్‌లోని హీరా నందిని అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని తోటలో పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం, నాగబాసాన్‌, ఎప్పటిలాగే పనికి వచ్చిన స్థితిలో, అతనితో కలిసి పనిచేస్తున్న తంగరాజ్‌ (70) మొబైల్‌ ఫోన్‌ అక్కడ ఉన్న నీటి ట్యాంక్‌లో పడిపోయింది. దానిని తియ్యడానికి నీటి ట్యాంక్‌లోకి దిగిన నాగభాసన్‌, ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. పాలూరు పోలీసులు, శ్రీ పెరుంబుదూర్‌ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి నాగభాసన్‌ మృతదేహాన్ని నీటి ట్యాంక్‌ నుంచి వెలికితీసి, పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పాలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టీవీకేలో ఊపందుకున్న వలసలు

తిరుత్తణి: అధికార టీవీకేలో రోజురోజుకీ వలసలు ఊపందుకుంటున్నాయి. స్థానిక సంస్థల్లో పదవులే లక్ష్యంగా కొత్త వ్యక్తులు తమను టీవీకేలో సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా అమ్మయార్‌కుప్పంకు చెందిన పారిశ్రామికవేత్త, విద్యావేత్త కార్తికేయన్‌ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వివిధ పార్టీల శ్రేణులు, యువత, మహిళలు సహా 500మంది మంగళవారం తిరుత్తణిలో టీవీకే కార్యాలయం చేరుకుని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డిల్లిబాబు సమక్షంలో టీవీకే తీర్ధం స్వీకరించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి జిల్లా కార్యదర్శితో పాటు ఆ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement