కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో తమిళగ వెట్రి కళగం ప్రచార సభలో జరిగిన ఘోర తొక్కిసలాట జరిగి ఆదివారంతో ఏడాది కాలం పూర్తయ్యింది. కాగా ఈ ఘటన జరిగిన ప్రదేశంలో మృతుల కుటుంబ సభ్యులు , పార్టీ నాయకులు ఘనంగా కన్నీటి నివాళులర్పించారు. తమ ఆప్తులను తలచుకుంటూ బాధిత కుటుంబాలు రోదించడంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
సాక్షి, చైన్నె : గత సంవత్సరం సెప్టెంబర్ 27న జరిగిన టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. బాధితుల కుటుంబాలకు టీవీకే తరఫున రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ జూలై 10న బాధితుల కుటుంబాలలో 31 మందికి ప్రభుత్వ పరంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగ నియమకాలు అందించడంతో పాటు, మృతుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఈ నియామకాల ప్రభుత్వ ఉత్తర్వును హైకోర్టు రద్దు చేయడంతో, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది.
ఘన నివాళులు:
ఈ తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆదివారం ఉదయం కరూర్ పాత బస్టాండ్ కూడలి వద్ద నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మృతుల బంధువులు, టీవీకే ప్రతినిధులు నల్లటి దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి, చేతుల్లో వెలిగించిన కొవ్వొత్తులతో మౌనం పాటించారు. శాంతి ర్యాలీ నిర్వహించారు. అలంకరించిన వేదికపై 41 మంది బాధితుల పేర్లతో ఉన్న బ్యానర్‌కు పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఉదయం 9.30 గంటలకు కరూర్ పా త బస్ స్టాండ్ కూడలి స మీపంలో నివాళి సభ ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై 41 మంది బాధితుల పేర్లతో కూడి న బ్యానర్‌ను ఉంచారు. టీవీకే రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, తదితరులు నల్ల టి దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి మౌనంగా పుష్పాంజ లి ఘటించారు. శాంతి ర్యాలీ నిర్వహించారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు తమ వారి చిత్రపటాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, కొవ్వొత్తులు వెలిగించి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నివాళి కార్యక్రమంలో మాజీ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్, కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి వి.పి. మతియళగన్, కృష్ణరాయపురం ఎమ్మెల్యే ఎం. సత్య, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నా రు. కరూర్ విషాదానికి కారణమైన వారిపై సీబీఐ విచారణ ద్వారా కఠిన చర్యలు తీసుకోవడ మే బాధితులకు ని జమైన నివాళి అని ఆయా కుటుంబా లు నినాదించారు. తమ వారిని తలచుకుంటూ కన్నీటి నివాళులర్పించారు.
ఏడాది గడిచినా న్యాయం ఏదీ..?
కరూర్ తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆ భయంకరమైన రోజున తమ ప్రజలు ఎదుర్కొన్న బాధ, వేదన ఇప్పటికీ చెరగని గాయంగా నిలిచిపోయాయని కరూర్ కాంగ్రెస్ ఎంపీ ఎస్. జ్యోతిమణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన వాట్సాప్ వేదికగా ఒక భావోద్వేగపూరిత ప్రకటనను విడుదల చేశారు.
సొంత తల్లి మరణం తర్వాత తనను అంతగా కుంగదీసిన సంఘటన కరూర్ విషాదమేనని జ్యోతిమణి పేర్కొన్నారు. పిల్లలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది గాయపడటం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆసుపత్రి మార్చురీలో పడి ఉన్న పసిపాపలు, బాధితులను చూసిన క్షణాలు ఇప్పటికీ తన గుండెను పిండేస్తున్నాయని చెప్పారు. ఏడాది కాలం గడిచినా బాధితుల కుటుంబాలకు తగిన న్యాయం అందలేదని, విచారణ క్రమం పక్కనపడిపోయిందనే వాస్తవాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన కరూర్ ప్రజల మరణాలకు తక్షణమే పూర్తిస్థాయి నిష్పాక్షిక న్యాయం జరగాలి. బాధితులకు ఎదురైన ఇటువంటి ఘోరమైన అఘాయిత్యాలు ప్రపంచంలో మరెక్కడైనా, ఎవరికీ పునరావతం కాకుండా భద్రతా చర్యలు ఉండాలి., కష్టాల్లో ఉన్న బాధితుల కుటుంబాలకు కాలం ఓదార్పునివ్వాలని, వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నిండాలని కోరుకుంటూ తన సానుభూతిని ప్రకటిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనలో దోషులు శిక్షించ బడినప్పుడే బాధితులకు నిజమైన నివాళి అని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు.
నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు
గతేడాది కరూర్‌లో జరిగిన తొక్కిసలాట సంఘటన తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఈ విషాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఆయన సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. 2025 సెప్టెంబర్ 27న జరిగిన ఈ ఘటన తన జీవితంలోనే కాకుండా, కరూర్ , తమిళనాడు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ మానని గాయాన్ని, వర్ణించలేని దుఃఖాన్ని మిగిల్చిందని ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. ప్రియమైన వారిని కోల్పోయి బాధపడుతున్న కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ తోడుగా, అండగా ఉంటామని సీఎం విజయ్ తన సందేశంలో తెలిపారు.


