తిరువళ్లూరు: పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు పోలీసు వ్యవస్థపై నమ్మకం ఏర్పడేలా వుండాలని ఆవడి పోలీసు కమిషనర్ సెంథిల్‌కుమార్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిదిలోని ఆవ డి, అంబత్తూరు, మాంగాడు, తిరునిండ్రవూరు, పొన్నేరి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినా యకుడి విగ్రహాలను ఆదివారం ఊరేగింపుగా తీసు కెళ్లి కాటూరు సముద్రతీర ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాట్టూరు సముద్రతీర ప్రాంతంతో పాటు పలు పోలీసు స్టేషన్లను ఆవడి కమిషనర్ సెంథిల్‌కుమార్ పరిశీలించారు. పోలీసుస్టేషన్‌లో వున్న వారెంట్ రికార్డులు, పోలీ సుల హాజరు, కేసుల పెండింగ్‌తో పాటు ఇతర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీసుల ప్రవర్తన వ్యవస్థపై బాధితులకు నమ్మకం ఏర్పడేలా వుండాలని పేర్కొన్నారు. రాత్రి సమ యంలో గస్తీని పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల వివరాల సేకరణ, గుట్కా, గంజాయి తదితర అక్రమ రవాణాపై మరింత నిఘా వుంచాలని ఆదేశించారు. వినాయకుడి నిమజ్జనం రోజు విగ్రహాలను ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


