వేలూరు: విద్యార్థులకు విద్యతో పాటుూ క్రమశిక్షణ, క్రీడలు అవసరమని బంగారుగుడి శ్రీ నారాయణి పీఠాధిపతి శక్తిఅమ్మ అన్నారు. వేలూరు శ్రీపురంలో శ్రీ నారాయణి పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పుట్‌బాల్ క్రీడా మైదానాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఆహార, వినియోగ దారుల శాఖ మంత్రి వెంకటరమణన్ మాట్లాడుతూ తాము ఎంచుకున్న రంగాలలో విజయం సాధించాలని అనుకునే విద్యార్థు లు ఎదురయ్యే ఏ పరిస్థితులైనా అధిగమించాలనే ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటే కచ్చితంగా విజయం సాధించవచ్చాన్నారు. బంగారుడి అధ్వర్యంలో అతి పెద్ద ఫుట్‌బాల్ మైదానం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేలు వేలయగన్, వినోద్‌కన్నన్, టవీకే జిల్లా కార్యదర్శి వేల్‌మురుగన్, బంగారుగుడి డైరెక్టర్ సురే ష్ బాబు, శ్రీ నారాయణి ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ, శక్తిఅమ్మ భక్తులు పాల్గొన్నారు.


