ఈ రోజుల్లో చిత్రం 50రోజులు ఆడటం రికార్డే | - | Sakshi
Sakshi News home page

ఈ రోజుల్లో చిత్రం 50రోజులు ఆడటం రికార్డే

Sep 6 2026 1:49 AM | Updated on Sep 6 2026 1:49 AM

తమిళసినిమా: ప్రేమను ఎన్ని విధాలుగా చెప్పినా, కొత్తగాను, ఆసక్తిగాను ఉంటుంది. అయితే కథనంలో కొత్తదనం ఉండాలి. అలా ప్రేమను సరికొత్తగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ఏన్‌ ఎన్నై ఏదో సెయ్‌ దాయ్‌. ఇది ముగ్గురు బాల్య మిత్రుల కథ. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో స్వభావం. ఒకరు పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందంగా గడిపే వ్యక్తి. మరొకరు ప్రేయసిని అమితంగా ప్రేమించే వ్యక్తి. ఇక మూడో వ్యక్తి ప్రేమ, పెళ్లి సాంప్రదాయాలను పెడచెవిన పెట్టి అమ్మాయి ల సుఖాన్ని కొనుకుంటూ ఎంజాయ్‌ చేసే వ్యక్తి. అయితే అందుకు అతనికి ఒక కారణం ఉంటుంది. అదే విధంగా తనకు పడక సుఖాన్ని అందించడానికి వచ్చిన ఒక యువతి అతని బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. ఈ విషయాన్ని తన మిత్రులకు చెబుతాడు. వాళ్లు బా గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమని సలహా ఇస్తారు. అలా ఒళ్లు అమ్ముకునే యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ తరువాత వారి జీవన పయనం ఎలా సాగింది? ఆ యువతి నేపధ్యం ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన, ఆలోచింపజేసే సన్నివేశాల తో రూపొందిన వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం ఏన్‌ ఎన్నై ఏదో సెయ్‌ దాయ్‌. ప్రేమ, స్నేహం వంటి అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి డీ. ఆంటోనీ కథ, కూర్పు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి. కథానాయకుడిగా నటించి, మిస్‌ ఆంటనిస్‌ అటెలియర్‌ పతాకంపై నిర్మించారు. నటి మధుమిత దాస్‌, జీవా రవి, రెజిన్‌ రోస్‌, నవ్యసు జీ తదితరులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి పెట్రో విల్లాని ఛాయాగ్రహణం, జైకర్‌ హరినాథ్‌, అశోక్‌ శ్రీధర్‌ ద్వయం సంగీతాన్ని,జోయ్‌ రాధ నేపథ్య సంగీతాన్ని అందించారు.

ఎన్‌ ఎన్నై ఏదో సెయ్‌ దాయ్‌ చిత్రంలో మధుమిత దాస్‌తో డి.ఆంటోని

సరికొత్త

ప్రేమకు నిర్వచనం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement