తిరువళ్లూరు: కిటికి కమ్మీలకు టవల్ వేసి ఆడుకుంటున్న సమయంలో టవల్ మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక విద్యార్ధి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానికి చెందిన బాలాజీ కుమారుడు నిరంజన్(7). ఇతను స్థాఽనికంగా వున్న ప్రైవేటు పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి కిటికి వున్న కమ్మీలకు పంచె వేసి ఆడుకుంటున్న సమయంలో పంచె బాలుడి మెడకు చుట్టుకుని ఊపిరాడక సృహ తప్పి కిందపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన బంధువులు బాలుడ్ని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స కోసం అనుమతించగా, బాలుడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


