తమిళసినిమా: నటుడు విష్ణు విశాల్ హీరోగా నటించిన చిత్రం కట్టా కుస్తీ – 2. ఆయన విష్ణు విశాల్ ప్రొడక్షన్స్, వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి చెల్లా అయ్యావు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటి ఐశ్వర్యలక్ష్మి నాయకిగా నటించిన ఇందులో నటి రమ్యకృష్ణ, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించినఈ చిత్రం జూలై 3వ తేదీ న విడు దలై విశేష ప్రేక్షకాదరణతో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అర్ధ శతదినోత్సవం వేడుకను స్థానిక అడయార్ లోని ఎంజీఆర్ జానకి ఆర్ట్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రాజ్ మోహన్, నటుడు ప్రభుదేవా ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గానికి జ్ఞాపికలను అందించి సత్కరించారు. మంత్రి రాజ్ మోహన్ మాట్లాడుతూ ‘‘ ఐసరి గణేష్ నిజమైన సినిమా ప్రేమికుడు. ఆయనలో ఎప్పుడూ పసి బిడ్డ తాను ఉంటుంది. ఎవరైనా సాయం కోరితే దాన్ని వెంటనే చేయాలని భావించే వ్యక్తి. సినిమా, విద్యా శాఖల్లో సేవలు అందిస్తున్నారు. సినిమాలు ఐదు రోజులు కాదు, ఐదుషోలు మాత్రమే ప్రదర్శింపబడుతున్న ఈ రోజుల్లో కట్టా కుస్తీ 2 చిత్రం 50 దాటి ప్రదర్శింపబడటం పెద్ద రికార్డు. ఇందుకు. నటుడు విష్ణు విశా ల్ వంటి కటిన శ్రమ జీవి. ప్రధాన కారణం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గం కషి ఉంది ‘‘ అని మంత్రి రాజ్ మోహన్ పేర్కొన్నారు. ఈ వేడుకలో నటి ఐశ్వర్య లక్ష్మి, రమ్యకృష్ణ తదితర చిత్ర వర్గాలు పాల్గొన్నారు.
మంత్రి రాజ్‌మోహన్ నుంచి జ్ఞాపికను అందుకుంటున్న రమ్యకృష్ణ
అమెరికా సంగీత కళాకారిణితో..
తమిళసినిమా: ప్రముఖ సంగీత దర్శకులు, సింగిల్స్ సైతం ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్,పై దృష్టి సారిస్తున్నారు. అయితే ఇంతకు ముందే అలాంటి మ్యూజికల్ ఆల్బమ్ లను రూపొందిస్తున్న పాపులర్ అయిన సంగీత కళాకారుల్లో గాయని డీ ఒకరు. ఈమె సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ దర్శకత్వంలో ఆడి పాడిన ప్రైవేట్ పాప్ మ్యూజికల్ ఆల్బమ్‌లతో అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. అలా ఈమె ఇంతకు ఆడి పాడిన వారీ వారీ అనే మ్యూజికల్ ప్రైవేట్ ఆల్బమ్ సంగీత ప్రియులను ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. కాగా అదే ఆల్బమ్ ను తాజాగా అమెరికా పాప్ సింగర్ లారా రాజ్ ఆఫ్ కట్ సేవయే తో కలిసి రీమిక్స్ చేశారు. దీనికీ సంతోష్ నారాయణన్‌నే సంగీతాన్ని అందించడం విశేషం. గీత రచయిత వావేక్ రాసిన ఈ పాటతో కూడిన ఈ ఆల్బమ్ కు 808 కృష్ణ సహ నిర్మాతగా వ్యవహరించారు. కాగా పాప్ సింగర్ డీ, అమెరికా కు చెందిన లారా రాజ్ కాంబినేషన్లో మన సంస్కృతి సంప్రదాయాలను ఆవిష్కరించి రూపొందించిన లేటెస్ట్ వారీ వారీ ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్ ఇప్పుడు మరోసారి యూట్యూబ్ ఛానళ్లలో అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌గా మారింది.
ద్రోహం పళగు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్
తమిళసినిమా: మిగిల్చి ప్రొడక్షనన్స్ పతాకంపై సీ.బ్యూల మిగిల్చి నిర్మిస్తున్న చిత్రం ద్రోహం పళగు. సియోన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు దక్ష న్ కథానాయకుడిగా నటించగా, నటుడు లొల్లు సభ జీవా, వాళై జానకి అమ్మ,వనిత విజయ్ కుమార్, జీఎం.కుమార్, గంజా కరుప్పు, విజయ్ టీవీ ఫేమ్ దివాకర్, అముదవానన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ ద్రోహం, నమ్మకం, అనుబంధాలు, భావోద్రేకాలు వంటి అంశాలతో రూపొందించిన కమర్షియల్ అంశాలతో కూడిన ఒక సాధారణ యువకుడి జీవిత పోరాటం ఈ చిత్రమని, పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని పేర్కొన్నారు. జీవితంలో కొన్ని గాయాలు ఎప్పటికీ మన్నించబడవు అనే ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ను పెప్సీ అధ్యక్షుడు ఆర్ కే.సెల్వమణి, ఎస్ వీ.శేఖర్, నట్టి నటరాజ్,, రామ్ కీ, నటి పూనం బాజ్వా, ఇనియ, నందిత శ్వేత, అస్మిత సింగ్ మొదలగు సినీ ప్రముఖు లు. తమ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది అని పేర్కొ న్నారు.ఇందులో నటుడు దక్షన్ నటనకు అవకాశం ఉన్న బల మైన పాత్రను పోషించినట్లు చె ప్పారు. ఫైట్ సన్నివేశాల్లోనూ బాగా నటించారని చెప్పారు. నిర్మాణ కార్యక్రమా లు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.


