తిరువళ్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన తాయ్‌మామన్(మేనమామ) పథకాన్ని లబ్ధిదారులకు అందించే బంగారు నాణెములను బద్రపరచడానికి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన గదిని కలెక్టర్ కవిత అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రిగా టివీకే అధినేత జోసెఫ్ విజయ్ అధికారాన్ని చేపట్టిన తరువాత మేనమామ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైద్యశాలలో గత జూన్ 22 నుంచి జన్మించిన పిల్లలకు ఒకగ్రాము బంగారు కాయిన్స్‌ను అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఽపథఽకాన్ని అన్నాజయంతి రోజైన సెప్టెంబర్ 17న ప్రారంభం కానుంది. కాగా జన్మించిన బిడ్డకు ప్రభుత్వ వైద్యశాలలోనే బంగారు కాయిన్స్‌ను ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో బంగారు కాయిన్స్‌ను నిల్వ వుంచడానికి ఏర్పాటు చేసిన లాకర్స్, సేఫ్టీరూమ్‌లను కలెక్టర్ కవిత పరిశీలించారు. అనంతరం గధులు పునఃనిర్మాణంతో పాటూ ఇతర సదుపాయాలపై పలుసూచనలు చేశారు. కాగా కలెక్టర్ వెంట డిప్యూటి డైరెక్టర్ ప్రియారాజన్, డీన్ మోహన్‌గాంధీ, సూపరింటెండెంట్ సురేష్‌బాబు, డాక్టర్ విజయరాజ్, జగదీష్, దినేష్, ప్రవీణ్‌రాజ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


