రేషన్‌ దుకాణాల్లో రూ. 35కే కిలో ఎర్రగడ్డల విక్రయం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దుకాణాల్లో రూ. 35కే కిలో ఎర్రగడ్డల విక్రయం

Sep 4 2026 2:00 AM | Updated on Sep 4 2026 2:00 AM

వేలూరు: వేలూరు జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాల్లోను రూ:35కు ఎర్రగడ్డను విక్రయం చేయనున్నట్లు కలెక్టర్‌ లీల అలెక్స్‌ అన్నారు. వేలూరు అన్నారోడ్డులోని కర్పగం సూపర్‌ మార్కెట్‌ వద్ద ఉన్న రేషన్‌ దుకాణంలో కిలో ఎర్రగడ్డ రూ. 35 కు విక్రయాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి విడతగా పట్టణ ప్రాంతంలో ఉన్న 146 రేషన్‌ దుకాణాల్లో రేషన్‌ కార్డు కలిగిన వారికి ఈ ఎర్రగడ్డను విక్రయం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎర్రగడ్డ నాణ్యతను పరిశీలించడంతో పాటు వాటి విక్రయాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఆర్గనైజర్‌గా కో–ఆపరేటివ్‌ శాఖ రిజిస్టార్‌ను నియామకం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు ఈ విక్రయాలను చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోఆపరేటివ్‌ శాఖ జాయింట్‌ రిజిస్ట్రార్‌ తిరుగుణ అయ్యప్పదురై, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కిలో ఎర్రగడ్డను ఒక నెల రోజులు ఏ విధంగా ఉపయోగించడం అనే విషయాలను రేషన్‌ కార్డుదారులు విక్రయ కేంద్రంలోని అధికారులను నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement