డెంగీ కట్టడికి ముందు జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

డెంగీ కట్టడికి ముందు జాగ్రత్తలు

Sep 4 2026 2:00 AM | Updated on Sep 4 2026 2:00 AM

తిరుత్తణి: డెంగీ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో కట్టడికి ముందస్తు జాగ్రత్తలు పట్ల జిల్లా ఆరోగ్యశాఖ అధికారి గురువారం తనిఖీ చేపట్టారు. వాతావరణంలో మార్పులు ఏర్పడి సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డెంగీ సహా విష జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో జ్వరాలు కట్టడికి సంబంధించి జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ప్రియారాజ్‌ తిరుత్తణి యూనియన్‌లోని ఇస్లాంనగర్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా మజ్దూర్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నీటి నిల్వ ప్రాంతాలు పరిశీలించి ఇళ్లు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీల్వ చేరకుండా వుండేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలని, టౌర్లు, కొబ్బరి చిప్పలు, కవర్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల వైద్యాధికారి కలైవాణి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ మురళి సహా అరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement