సాక్షి, చైన్నె : డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీఎంకే ఉన్నత స్థాయి కార్యవర్గ సమావేశం తదుపరి పరిణామాలతో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలో పదవుల కేటాయింపు, వయోపరిమితి , నియమ నిబంధనలపై పలువురు సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పవచ్చు.
జిల్లా కార్యదర్శుల పదవీ కాలంపై ప్రశ్నలు
స్టాలిన్ సమక్షంలోనే ఈ సమావేశంలో మాట్లాడిన 8 మంది ప్రముఖులలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎస్. పళనిమాణికం, పూందమల్లి మాజీ ఎమ్మెల్యే కృష్ణస్వామి తదితరులు డీఎంకే నిబంధనలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. పార్టీలో అన్ని పదవులను కేవలం రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే నిబంధనలు ఉన్నప్పుడు, జిల్లా కార్యదర్శి పదవిని మాత్రం మూడుసార్లు చేపట్టడానికి ఎందుకు అనుమతిస్తున్నారని, ఈ నిర్ణయాన్ని కూడా పునర్ పరిశీలించి మార్చాగలని వారు వ్యాఖ్యానించారు. అలాగే తిరువిడైమరుత్తూరు రామలింగం, ఈరోడ్ కనిమొళి, ప్రభు, గజేంద్రన్, తిరుతురైపూండి ఇళయరాజా, మహమ్మద్ శశి తదితర నాయకులు ఇదే నినాదం అందుకోవడం గమనార్హం.
మాజీ మంత్రుల పనితీరుపై అసంతృప్తి
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూ పోరాడుతుంటే, పార్టీకి చెందిన మాజీ మంత్రులు మాత్రం అసెంబ్లీలో క్రియాశీలకంగా మాట్లాడటం లేదన్న చర్చ కూడా జరిగి ఉండటం గమనార్హం. కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తూ సైగలు చేయడం తప్ప నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలని నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలో నేను ఎల్‌కేజీ విద్యార్థి..
ఈ వ్యవహారంపై ఇటీవలే డీఎంకేలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారన్న సంకేతాలు వెలువడ్డాయి. ‘‘నేను ఇటీవల మాత్రమే డీఎంకేలో చేరాను. పార్టీ పరంగా చూస్తే నేను ఇంకా ఎల్‌కేజీ విద్యార్థినే. కానీ, డీఎంకేలో నేను చేపడుతున్న కార్యకలాపాలు, చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే త్వరలోనే పీహెచ్‌డీ పట్టా పొందే స్థాయిలో ఉన్నాను’ అని చమత్కరించి ఉండటం విశేషం.
డీఎంకే కార్యాలయం


