ముగ్గురు తమిళులను కాల్చి చంపారు! | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు తమిళులను కాల్చి చంపారు!

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

● పీఎంకే నిజనిర్ధారణ కమిటీ ● బాధిత కుటుంబాలకు పరామర్శ

సాక్షి, చైన్నె : కర్ణాటకలోని సమ్రాజ్‌పేట జిల్లా అడవుల్లో రాష్ట్ర అటవీ శాఖ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను పీఎంకే నిజ నిర్ధారణ కమిటీ పరామర్శించింది. అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. క ర్ణాటకలోని సమ్రాజ్‌పేట జిల్లా అడవుల్లో రాష్ట్ర అటవీ శాఖ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను పీఎంకే వాస్తవ పరిశీలన బృదం కలిసి, సంతాపం తెలిపింది. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌ అక్కడ జరిగిన సంఘటనపై విచారణ జరిపేందుకు ధర్మపురి జిల్లా మాజీ పీఎంకే ఎమ్మెల్యేలు వేలుస్వామి, వెంకటేశ్వరన్‌, నిర్వాహకులు షణ్ముగం, ప్రభుత్వం, కృష్ణగిరి జిల్లా నిర్వాహకులు మంజునాథ్‌, శరవణన్‌లతో కూడిన ఒక బృందాన్ని పంపారు. ఈ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. అక్కడి వాస్తవిక పరిస్థితులను ఆరా తీసింది. అక్కడ తమ పరిశీనలో వెలుగు చూసిన అంశాలను గురువారం ధర్మపురిలో విలేకరులకు వివరించారు. కాల్చి చంపబడిన ముగ్గురు వ్యక్తులు, ఆంటోనీస్వామి (50), జాన్‌ రాస్‌ పీటర్‌ (42), కుమార్‌ (36)లపై ఎలాంటి క్రిమినల్‌ కేసు నమోదు కాలేదన్నారు.. తప్పిపోయిన పశువులను వెతకడానికి వెళ్లినప్పుడు ఆంటోనీస్వామి తన బంధువులను వెంట తీసుకువెళ్లాడని వివరించారు. చాలాసేపు వెతికినా పశువులు కనిపించకపోవడంతో, వారు రాత్రి అడవిలోని ఒక బండరాయిపై నిద్రించారని, ఈనెల 15వ తేదీ తెల్లవారుజామున ఆ ప్రాంతానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బంది, చాలా దగ్గరగా నిలబడి వారిని కాల్చి చంపారని తమ పరిశీలనలో తేలిందన్నారు. కొద్ది దూరంలో పడి ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే తప్పించుకున్నాడని, అతని ద్వారానే అడవిలో జరిగిన విషయం బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పేర్కొంటూ, అటవీ శాఖ ఆ ముగ్గురి మృతదేహాలను ఒక సరుకు రవాణా ట్రక్కులో ఎక్కించి, బుల్లెట్‌ గాయాలకు చికిత్స కోసం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిందన్నారు. మొత్తం మీద, ఈ కాల్పుల ఘటన పథకం ప్రకారం జరిగిన హత్య అని ఆరోపించారు.తమ దర్యాప్తు నివేదికను అన్బుమణి ద్వారా కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, బాధితులకు సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement