హలో మిస్ చిత్రంలో సాయిరా, నటి బిస్మీ తదితరులు
తమిళసినిమా: నమహా మూవీ పిక్చర్స్ పతాకంపై ఎన్ .కుమార్ లాల్ నెహ్రూ నిర్మిస్తున్న చిత్రం హలో మిస్. సాయిరా కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి బిస్మీ నాయకిగా పరిచయం అవుతున్నారు . కాగా ఇందులో దర్శకుడు కేఎస్ రవికుమార్ ,కళ్యాణి నటరాజన్, సుజాత, జానకి సురేష్, జీ. జ్ఞాన సంబంధన్, సెంథిల్ కుమారి, భువనేశ్వరి, బాలహాసన్, దినేష్ ,స్వామినాథన్, సత్యన్, బిర్లా బోస్ ,సిటిజెన్ మణి, మారన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్పి గురుదేవ్ ఛాయాగ్రహణంను, ప్రిన్స్ జార్జ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొంటూ చిత్ర షూటింగును చైన్నె, తిరుచ్చి ,పాండిచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ఇదిచక్కని మానవ సంబంధాలతో కూడిన యూత్ ఫుల్ రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం గా ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక తీయని అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసినట్లు, దీనికి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. హలో మిస్ ప్రేక్షకులను కచ్చితంగా ఆలరింప చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.
ధనుష్‌కు జంటగా రుక్మిణి వసంత్
తమిళసినిమా: నటుడు ధనుష్ నూతన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఈయన రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నటి సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కాగా నటుడు వరుసగా మరిన్ని చిత్రాలు కమిట్ అయ్యారు. అందులో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రం, వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ్ మురుగన్ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ చిత్రం ఒకటి కమిట్ అయినట్లు ప్రచారంలో ఉంది. అదేవిధంగా లబ్బర్ బంత్తు చిత్రం ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఇందులో నాయకిగా రుక్మిణి వసంత్ నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే కనుక నిజమైతే ఈ భామకు ఇది లక్కీ ఛాన్స్ అవుతుందే చెప్పవచ్చు కారణం ఈమె ఇంతకు విజయ్ సేతుపతి కి జంటగా నటించిన ఎస్ చిత్రం నిరాశపరిచింది. ఆ తరువాత శివకార్తికేయన్‌తో జత కట్టిన మదరాసీ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి తమిళంలో ధనుష్ కు జంటగా నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుని, అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని తాజా సమాచారం. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు.


