తిరుత్తణి: పోలీసులు స్వాధీనం చేసుకున్న వివిధ వాహనాలను తిరుత్తణి పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుకు ఇరు వైపులా నిలిపారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. తిరుత్తణి ఇంద్రానగర్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వుంది. దీనిపక్కనే కన్నికాపురం, మాంబాక్కం, షోళింగర్ రాష్ట్ర రహదారి ఉంది. నిత్యం వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. పోలీసులు వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలిపి ఉంచారు. దీంతో రోడ్డు కుచించుకుపోయింది, రోడ్డు మలుపు ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు నిలిపిన వాహనాలను తొలగించేందుకు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.


