తమిళ సినిమా: యూత్ ఫుల్ లవ్ స్టోరీతో రూపొందించిన చిత్రాలు ఈ తరం యువతను బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాయి. అలాంటి కథాంశంతో రూపొందిన చిత్రం ప్యార్ ప్రేమ కల్యాణం. స్టార్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై ప్రశంసలు అందుకున్న ఎలన్ తాజాగా ప్యార్ ప్రేమ కల్యాణం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈయన కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇందులో నటి శాన్వీ మేఘ్నా నాయకిగా నటించారు. నటి రాధిక శరత్ కుమార్, యోగిబాబు, సెంథిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. దీన్ని రైస్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం స్థానిక నుంగంబాక్కమ్‌లోని ఒక నక్షత్ర హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెట్రిమారన్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ స్టార్ చిత్రం షూటింగ్‌లోనే దర్శకుడు ఎలన్ వర్క్ తనను ఇంప్రెస్ చేసిందన్నారు. ఈ చిత్రం రెండు నిమిషాల ట్రైలర్ చూడగానే ఇది మంచి రామ్ కామ్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా ఉంటుందని అర్థమైందన్నారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. చిత్ర దర్శక కథానాయకుడు ఎలన్ మాట్లాడుతూ ఇది అందరినీ కనెక్ట్ చేసే లవ్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ప్రేమ, పెళ్లి నేపథ్యంలో సాగే అందమైన కథా చిత్రమని, అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కథానాయకి శాన్వి మేఘ్నా, నటి రాధిక శరత్ కుమార్, సెంథిల్, యోగిబాబు, కుమరన్ వేల్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా తదితరులు పాల్గొన్నారు.


