భారత్‌ను ఏఐ ఇంజినీర్ల గ్లోబల్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భారత్‌ను ఏఐ ఇంజినీర్ల గ్లోబల్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

● ఏఐ అకాడమి ఇన్‌ ఎ బాక్స్‌ సమ్మిట్‌లో వక్తలు

● ఏఐ అకాడమి ఇన్‌ ఎ బాక్స్‌ సమ్మిట్‌లో వక్తలు

సాక్షి, చైన్నె : భారత్‌ను ఏఐ ఇంజినీర్ల గ్లోబల్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పలువురు వక్తలు తెలిపారు. చైన్నెలో శుక్రవారం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టాలెంట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌ రెవతేచర్‌ ఆధ్వర్యంలో ఏఐ అకాడమి ఇన్‌ ఎ బాక్స్‌ – ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగంలో భారతీయ ఇంజినీరింగ్‌ విద్య భవిష్యత్తు అనే అంశంపై జాతీయ స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 40 ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ముఖ్య అతిథిగా హాజరై రెవతేచర్‌ రూపొందించిన ఇంజినీరింగ్‌ ఇండియాస్‌ నెక్ట్స్‌ ఇంజినీర్‌ అనే ప్రత్యేక నివేదికను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఏఐ టాలెంట్‌ తయారీలో భారత్‌కు ఒక యూపీఐ లాంటి విప్లవాత్మక క్షణం అవసరమని వివరించారు. నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ తరహాలో పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రాక్టికల్‌ అసెస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నీలిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మదన్‌ మోహన్‌ త్రిపాఠి, రెవతేచర్‌ కో ఫౌండర్‌ అశ్విన్‌ భరత్‌ , సీఈఓ టి.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement