సాక్షి, చైన్నె : మేల కోట్టైయూర్‌లోని మేళ్లకోటైయూర్‌లోని ఎస్‌డీఏటీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో నిర్వహించిన 4వ టీఎన్‌టీటీఏ– ఎస్‌కే రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చైన్నెకి చెందిన ఎం.ఆర్. బాలమురుగన్, శ్రియ వరుసగా పురుషులు, మహిళల సింగిల్స్ టైటిళ్లను కై వశం చేసుకున్నారు. విజేతలకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మొత్తం రూ. 4,40,200 నగదు బహుమతులను అందజేశారు. పురుషుల విభాగంలో ఎం.ఆర్. బాలమురుగన్ (చైన్నె) 11–8, 13–11, 11–6, 6–11, 9–11, 11–8 తేడాతో ఎస్. తరుణ్ పై విజయం సాధించారు. మహిళల విభాగంలో ఎ. శ్రియ 11–7, 14–12, 11–2, 11–7 తేడాతో ఎస్. అమృతపుష్పక్ పై గెలిచారు. అలాగే అండర్ 19 బాలురు విభగంలో ఎం మహ్మద్, బాలికలవిభాగంలో బిఆర్ నందిని విజయం సాధించారు. అండర్–17 బాలుర విభాగంలో విశ్రుత్ రామకృష్ణన్, బాలికల విభాగంలో ఓ.పి. పూజశ్రీ, అండర్–15 బాలుర విభాగంలో జె.ఎన్. సంజయ్ అరవింద్ , బాలిక విభాగంలో హెచ్ తనిష్కా విజయం సాధించారు. బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్లేయర్ (వాసుదేవన్ మెమోరియల్ ట్రోఫీ) తార్సన్ ఆది(సేలం) అందుకున్నారు.


