సాక్షి, చైన్నె : చైన్నె శివారు ప్రాంతాల ప్రజల రవాణా సౌకర్యార్థం కిలాంబాక్కం బస్టాండ్ నుండి చెంగల్పట్టు వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరించేందుకు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక తయారీకి టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటికే చైన్నె విమానాశ్రయం నుండి కిలాంబాక్కం వరకు మెట్రో పొడిగింపు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేచి ఉన్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా చెంగల్పట్టు వరకు మార్గాన్ని పొడిగించాలని ప్రణాళిక రూపొందించారు.
రూట్ – వ్యయం:
ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ. 9,335 కోట్లుగా నిర్ణయించారు. విమానాశ్రయం, తాంబరం రైల్వే స్టేషన్, కిలాంబాక్కం బస్ స్టాండ్‌లను అనుసంధానిస్తూ 15.46 కి.మీ మార్గంలో 13 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ప్రయాణికుల రద్దీ, నిర్మాణ వ్యయం, స్టేషన్ల ప్రదేశాలు మరియు నేల స్వభావాన్ని విశ్లేషించి మెట్రో యాజమాన్యం త్వరలోనే తుది నివేదిక సిద్ధం చేయనుంది.


