సాక్షి, చైన్నె : పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ’వి ద లీడర్స్’ సంస్థ నాయకుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆగస్టు 16న చైన్నెలో ఒక భారీ పాదయాత్ర నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసిన అనంతరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వి ద లీడర్స్ అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థలో సభ్యత్వ నమోదు వేగంగా సాగుతోంది. సాధారణ ప్రజలు ఎక్కువగా సమకూరే ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 19.32 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ పరిస్థితులలో ఆగస్టు 16న చైన్నెలోని ఎగ్మోర్ రాజరత్నం మైదానం సమీపంలో పాదయాత్ర నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి లభించినట్లు వీది లీడర్స్ వర్గాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో వి ద లీడర్స్ ప్రతినిధులు నిమగ్నమయ్యారు.
రాజకీయ వ్యూహం:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఉద్యమం నేరుగా పోటీ చేస్తుందని అన్నామలై ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం కోయంబత్తూరులో ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి, అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా ఆగస్టు నెల మొత్తం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని వి ద లీడర్స్ నిర్ణయించింది. ఆగస్టు 2న కన్యాకుమారిలో అన్నామలై పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సభ్యత్వంపై అన్నామలై స్పష్టత
తమ సంస్థ సభ్యత్వం 50 లక్షలకు చేరుకున్న తర్వాత దీనిని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తామని, . ఒకవేళ ఉప ఎన్నికల నాటికి ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతే వి ద లీడర్స్ కూటమి పేరుతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నామలై ప్రకటించారు.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రాబోయే 6 నెలల్లో వెల్లడిస్తామని అన్నామలై తెలిపారు. తమిళనాడు నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఈ మార్పులో భాగస్వాములవుతున్నారని,. స్థానిక ఎన్నికలకు ముందు ప్రజల విశ్వాసాన్ని, మద్దతును పొందడమే తమ ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు.


