10వ అంతస్తులోకి.. సీఎం ఛాంబర్‌ | - | Sakshi
Sakshi News home page

10వ అంతస్తులోకి.. సీఎం ఛాంబర్‌

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

10వ అంతస్తులోకి.. సీఎం ఛాంబర్‌ ●శరవేగంగా పనులు

●శరవేగంగా పనులు

సాక్షి,చైన్నె: సీఎం విజయ్‌ కోసం నామక్కల్‌ కవింజ్ఞర్‌ మాళిగైలోని 10వ అంతస్తులో ప్రత్యేక కార్యాలయం రూపుదిద్దుకుంటోంది. ఈ పనులను వేగవంతం చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. తమిళనాడు సచివాలయం సెయింట్‌ జార్జ్‌ కోటలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న వారు అంతా జార్జ్‌ కోటలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ కోటలో స్థలం కొరతతో పాటుగా కొన్ని సమస్యలు ఎదురైనట్టు సమాచారం. దీంతో సీఎంవిజయ్‌ తన కార్యాలయాన్ని జార్జ్‌కోట నుంచి పక్కనే ఉన్న నామక్కల్‌ కవింజ్ఞర్‌ మాళిగైకు మార్చేందుకు ఆదేశాలుజారీ చేసి ఉన్నారు. దీంతో ఈ భవనంలోని 10వ అంతస్తు పూర్తిగా సీఎం కార్యాలయం కోసం ప్రత్యేక హంగులతో రూపదిద్దుకుంటోంది. ఈ పనులు రెండు మూడు రోజులలో ముగించి సీఎం విజయ్‌ కొత్త కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగించే దిశగా చర్యలు విస్తృతం చేసి ఉన్నారు. అదే సమయంలో జార్జ్‌ కోటలో ఉన్న సచివాలయంకు సంబంధించిన మంత్రులు, కీలక అధికారుల కార్యాలయాన్ని మరోచోటకు మార్చేందుకు సైతం శరవేగంగా కసరత్తు జరుగుతుండటం గమనార్హం. అయితే జార్జ్‌ కోట పురాతన భవనం నుంచి కాకుండా ఇదే ప్రాంగణంలో ఉన్న నామక్కల్‌కవింజ్ఞర్‌ మాళిగైలోకి సీఎం మారుతుండటం వాస్తు పరమైన అంశమా..? అన్న చర్చ ఊపందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement