ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన ర్యాలీ

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

తిరుత్తణి: ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా తిరుత్తణిలో శుక్రవారం ప్రయివేటు నర్సింగ్‌ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పట్టణంలోని చిత్తూరు రోడ్డు కూడలిలో మండల వైద్యధికారి డాక్టర్‌ కలైవాణి జెండా ఊపి ప్రారంభించారు. కళాశాలకు చెందిన వంద మంది విద్యార్ధినులు ర్యాలీలో పాల్గొని ప్లకార్డులు చేతబట్టి పట్టణంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డు, మపోసీ రోడ్డు, బస్టాండు, అక్కయ్య రోడ్డు సహా ప్రదాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి అవగాహన కల్పించారు. ప్రపంచ జనాభా పెరుగుదలతో చోటుచేసుకుంటున్న సమస్యలు, చిన్న కుటుంబాలతో కలిగే మేలు తదిరాలను వివరించారు. చివరగా కమల థియేటర్‌ కూడలి వద్ద మానవహారం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో మండల హెల్త్‌ సూపర్‌వైజర్‌ మురళి, ఆరోగ్యశాఖ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement