తమిళనాడులో రావు బహదూర్‌ | - | Sakshi
Sakshi News home page

తమిళనాడులో రావు బహదూర్‌

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

తమిళ సినిమా : ఇంతకు ముందు స్టార్స్‌ నటించిన చిత్రాలు మాత్ర మే ఇతర భాష ల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందేవి. ఇటీ వల ఆ పరిస్థితి మారింది. మంచి కథా చిత్రాలన్నీ మాతృభాషలో రూపొంది ఇతర భాష ల్లో విడుదలై ప్రశంసలతో పాటు వసూళ్ల ను సాధిస్తున్నా యి. అలా తాజాగా తమిళనాడులో విడుదలై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్న చిత్రం రావు బహదూర్‌. ప్రముఖ నటుడు మహేష్‌ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ+ఎస్‌ మూవీస్‌, బెటర్‌ ఇన్వెస్ట్‌ మీడియా విజన్‌ ఫండ్‌, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ సంస్థల అధినేతలు చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్‌ రెడ్డి, చరత్‌చంద్ర, ఈశ్వరన్‌ విజయ్‌ రాఘవన్‌ కలిసి నటించిన చిత్రం ఇది. దీనికి వెంకటేష్‌ మహి కథ, ఎడిటింగ్‌, దర్శకత్వం బాధ్యతలను చేపట్టారు. ఈయన ఇంతకు కేరాఫ్‌ కంచర పాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించి కమర్షియల్‌ గాను సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు అన్నది గమనార్హం. తాజాగా ఆయన మరో కోణంలో తెరపై ఆవిష్కరించిన చిత్రం రావు బహదూర్‌. అనుమానం పెనుభూతం అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన చిత్రం ఇది. ఈ కథకు ఆయన రాజవంశాన్ని నేపథ్యంగా తీసుకుని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించారు. నటుడు సత్యదేవ్‌ రాజవంశస్తుడిగా నటించారు. వికాస్‌ ముప్పల, దీపా థామస్‌, బాలా పరాసర్‌, ఆనంద్‌ భాస్కర్‌, ప్రణవ్‌ వికా, మాస్టర్‌ కిరణ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్మరన్‌ సాయి సంగీతాన్ని, కార్తీక్‌ పర్మర్‌ ఛాయాగ్రహణాన్ని అందించారు. ఈ చిత్రం గత వారం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా శుక్రవారం తమిళనాడులో విడుదల అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement