క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

తెలుగు మీడియంలో

అడ్మిషన్‌కు మిక్సీ ఉచితం

పళ్లిపట్టు: తెలుగు మీడియంలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచడానికి హెచ్‌ఎం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులకు కానుకగా మిక్సీ అందజేశారు. పళ్లిపట్టు యూనియన్‌లోని అత్తిమాంజేరిపేట ప్రభుత్వ తెలుగు పాఠశాలలో 14 మంది విద్యార్థులు చదువుకుంటన్నారు. ఆ పాఠశాల హచ్‌ఎంగా భూపతి విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో విద్యార్ధుల అడ్మిషన్లు పెంచే విధంగా ప్రతి ఏటా వినూత్నంగా బహుమతులు అందజేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్ల కోసం కొత్తగా తెలుగు మీడియంలో విద్యార్థులను చేర్పించే తల్లిదండ్రులకు మిక్సీ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ క్రమంలో ఒకటవ తరగతిలో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు చేరారు. వారికి పాఠశాల ద్వారా ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం, ప్రభుత్వ విద్యా సామగ్రి అందజేశారు. హెచ్‌ఎం తన సొంత నిధులతో రెండు మిక్సీలు అందజేశారు.

మామిడికి మద్దతు ధర ప్రకటించాలి

తిరుత్తణి: మామిడికి కనీస మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరారు. తమిళనాడు వ్యవసాయల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తిరుత్తణిలో మామిడి రైతుల మహానాడు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ సంఘం జిల్లా కోశాధికారి పెరుమాళ్‌ అధ్యక్షత వహించారు. ఇందులో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రన్‌, రాష్ట్ర కార్యదర్శి తులసినారాయణన్‌ ప్రసంగించారు. గత ఐదేళ్లుగా మామిడి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. పంట దిగుబడి వున్నా, లేకపోయినా గిట్టుబాటు ధరలు అందడం లేదని వాపోయారు. గాలీవానకు కాయలు రాలిపోయి ఆపార నష్టం కలిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వరి, చెరుకుకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించిందని, అదేవిధంగానే మామిడికి సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మామిడి పంటకు నష్ట పరిహారంగా కేజీకి ప్రభుత్వం రూ.10 ప్రకటించాలని, తిరుత్తణి, గుమ్మడిపూండిలో మామిడి జ్యూస్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు తీర్మానం ఆమోదించారు.

ఇంజిన్‌లో సాంకేతిక లోపం

– 2 గంటలు ఆగిన రామేశ్వరం

ఎక్స్‌ప్రెస్‌ రైలు

తిరువొత్తియూరు: చైన్నె–రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో పన్రుట్టి సమీపంలో సుమారు 2 గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం సాయంత్రం 6 గంటలకు చైన్నె ఎగ్మోర్‌ నుంచి బయలుదేరింది. రాత్రి 8 గంటలకు విల్లుపురం చేరుకున్నాక ఇంజిన్‌ మార్చారు. రాత్రి 8:40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే సేందనూర్‌ స్టేషన్‌ సమీపంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. రైల్వే అధికారులు విల్లుపురం నుంచి ప్రత్యామ్నాయ ఇంజిన్‌ను పంపించారు. సుమా రు 2 గంటల ఆలస్యం తర్వాత రాత్రి 11 గంటలకు రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో రామేశ్వరం మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

అసంఘటిత

రంగ కార్మికుల నమోదు

తిరువొత్తియూరు: అసంఘటిత రంగ కార్మికు లు సంబంధిత సంక్షేమ బోర్డుల్లో సభ్యులుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు కాంచీపురం జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఒకసారి పేర్లు నమోదు చేసుకున్న తర్వాత 60 ఏళ్లు నిండేవరకు ప్రతి 5 ఏళ్లకోసారి సభ్యత్వాన్ని ఆన్‌లైన్‌లో నవీకరించుకోవాలని సూచించారు. సభ్యులుగా ఉన్నవారు విద్య, వివాహం, ప్రసూతి, పెన్షన్‌, సహజ, ప్రమాద మరణం వంటి వివిధ ఆర్థిక సహాయాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవ చ్చని వెల్లడించారు. నమోదు లేదా నవీకరణ ప్రక్రియకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. 18 నుంచి 60 ఏళ్లలోపు వారు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసు కుని ప్రభుత్వ పథకాలు పొందాలని సూచించారు. వివరాలకు కాంచీపురంలోని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ కార్యాలయాన్ని నేరుగా గానీ లేదా 044–29593177 ఫోన్‌ నంబర్‌ ద్వారా గానీ సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement