ఆడికృత్తిక వేడుకల ఏర్పాట్లపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఆడికృత్తిక వేడుకల ఏర్పాట్లపై సమీక్ష

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కవిత ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆగస్టు 4న ఆడి అశ్వినితో ఆడికృత్తిక తెప్పోత్సవాలు ప్రారంభమై ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆగస్టు 6న ప్రసిద్ధి చెందిన ఆడికృత్తిక వేడు కలు జరుగనున్నాయి. ఇందులో తమిళనాడుతో పాటు ఆంధ్ర, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు కావళ్లు చెల్లించి స్వామిని దర్శించుకోనున్నారు. వేడుకలు పురస్కరించుకుని తిరుత్తణి కొండ ఆలయంలోని కావడి మండపంలో కలెక్టర్‌ కవిత అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడం, దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక వసతు ల కల్పన, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుదీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పోలీసుల పటిష్ట బందోబస్తు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై చర్చించారు. అధికారులు ఆయా శాఖల ద్వారా పనులను చేపట్టనున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. రెండవ సమీక్ష సమావేశంలో సమగ్ర సమా చారంతో అధికారులు సమీక్ష సమావేశంకు హాజరుకావాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ శ్రీదరన్‌, జాయింట్‌ కమిషనర్‌ రమణి, ఏఎస్పీ శిబమ్‌ దిమాన్‌, ఆర్డీఓ కనిమొళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement