తమిళసినిమా: నటుడు కమలహాసన్ గురించి ఇప్పుడు ప్రత్యే కంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సినిమాకు సంబంధించిన అన్ని శాఖల్లోను పరిణితి కలిగిన పరిపూర్ణ కళాకారుడు ఆయన. వైవిధ్యానికి కేరాఫ్ కమలహాసన్. వినూత్న ప్రయోగాలకు ఆద్యుడు. ప్రస్తుతం తన చిరకాల మిత్రుడు రజనీకాంత్ హీరోగా ధర్మన్ చిత్రాన్ని తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తదుపరి రజనీకాంత్‌తో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా నటుడు కమలహాసన్ ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో థక్ లైఫ్ చిత్రంలో నటించారు. ఇది ఆయన నటించిన 234వ చిత్రం. కాగా 235 చిత్రాన్ని నా.రజిత్ దర్శకత్వంలో, 236వ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలోనూ చేయనున్నట్లు ప్రచారంలో ఉంది. ఆయన తన 237వ చిత్రాన్ని ప్రము ఖ స్టంట్ మాస్టర్స్ ద్వ యం అన్బరివ్ దర్శకత్వంలో నిర్మించి, నటించడానికి సిద్ధమయ్యారు. దీన్ని బ్రహ్మాండ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా నిర్మించ తలపెట్టారు. ఇందులో ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. దీని కోసం ఆయన కొద్ది కాలం పాటు అమెరికాలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ కూడా పొందారు. అయినప్పటికీ ఈ చిత్రం షూటింగ్ ఇంకా తెరకెక్కలేదు. ఇప్పటికీ ఈ చిత్రానికి చెందిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా తన 227 చిత్రాన్ని రూపొందించాలన్న నిర్ణయంతో కమలహాసన్ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పలు యానిమేషన్, ఏఐ సన్నివేశాలు ఉంటాయని, ఈ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కు జాప్యం జరుగుతోందని తెలిసింది.


