తమిళసినిమా: నటుడు యోగి బాబు కథానాయకుడిగా నటించిన 300వ చిత్రం అర్జునన్ పేర్ పత్తు. ఇందులో నటి అనామిక మహీ నాయకిగా నటించింది. ఇందులో కాళీ వెంకట్, అరుళ్ దాస్, లెనిన్ భారతి, సుబ్రహ్మ ణ్యం శివ, మైనా నందిని, మదన్ దక్షిణామూర్తి, సెండ్రాయన్, హలో కందస్వామి, ఎం.సౌందర్య శరవణన్, రంజన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆర్.రాజ్ మోహన్ కథ, కథనం బాధ్యతలను చేపట్టారు. ఈ చిత్రాన్ని దేవ్ సినిమాస్ పతాకంపై కతిక తంగపాండి ఎస్.తంగపాండి డీ నిర్మించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం చేప ట్టారు. ఇందులో పాల్గొన్న నటు డు యోగి బాబు మాట్లా డు తూ ఇది తాను నటించిన 300వ చిత్రం అని దర్శక నిర్మాతలు ఎలా కనుగొన్నారో తెలియదన్నారు. తనకు సంఖ్య ముఖ్యం కాదని, నటిస్తూనే ఉండాలని అన్నా రు. నాగే శ్, మనోరమ అమ్మ మాదిరి నటించారని తెలిపారు. అదే విధంగా తనను అందరూ కామెడీ నటుడు అంటున్నారని, అదే తనను కాపాడుతోందన్నారు. మరో విష యం ఏమి టంటే తాను 2016 లోనే నయనతారతో కలిసి నటించానని, ఇకపై ఎవరితో నటించలేదన్న చింత లేదన్నా రు. తనకు హీరోయిన్ ఎవరన్నది ముఖ్యం కాదని, కథే ముఖ్యమన్నారు. చిత్ర దర్శకుడు రాజ్ మోహన్ గురించి చెబుతూ ఒకసారి తనని కలిసి కథ చెప్పారని, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని చెప్పారు. రెండేళ్ల క్రితం తానే ఆయనకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అని అడిగానన్నారు. అందు కు ఆయన తాను చేస్తున్న పని గురించి చెప్ప గా, చైన్నెకి రండి చిత్రం చేద్దాం అని పిలిచానన్నా రు. అలా ఈ చిత్రం ప్రారంభమైనట్లు చెప్పారు. చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందించారు.


