క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 20 2026 10:17 AM | Updated on Mar 20 2026 10:17 AM

నిద్రపోతున్న భర్త హత్య

అన్నానగర్‌: వేధింపులకు గురి చేస్తున్న భర్త ద్రపోతున్నప్పుడు అతని తలపై రాయి వేసి చంపిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా, అమ్మపేట, వైయాపురి వీధికి చెందిన తంగం(40). ఇతని భార్య పద్మ(40). చాలా కాలం తర్వాత వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తంగం మద్యానికి బానిస అయ్యాడని తెలుస్తోంది. తన భార్య పద్మ ప్రవర్తనపై అనుమానం వచ్చినప్పుడు, అతను తరచూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి పద్మతో తీవ్రంగా గొడవపడి, పద్మపై దాడి చేశాడని తెలుస్తోంది. ఆ తర్వాత మద్యం మత్తులో తంగం అక్కడే నిద్రపోయాడు. భర్త నిరంతరం వేధించడం, కొట్టడంతో ఆగ్రహించిన పద్మ ఇంట్లోంచి ఒక బండ రాయి తీసుకుని అతను నిద్రిస్తుండగా తలపై విసిరింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే రక్తస్రావంతో మరణించాడు. తంగం సోదరుడు మణి(43) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, అమ్మపేట్టై పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మురుగరాజ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. తదనంతరం హత్య కేసులో పోలీసులు పద్మను అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఏఐతో కొత్త ఒరవడి

సాక్షి, చైన్నె: టెక్నాలజీ, ఫ్యాషన్‌ను అనుసంధానిస్తూ అమెజాన్‌ ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ వినియోగదారుల కోసం విప్లవాత్మక మార్పులను పరిచయం చేసింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సాధనాలతో ’స్ప్రింగ్‌ సమ్మర్‌ ’26’ కలెక్షన్‌ను గురువారం ఆవిష్కరించింది. ఈ సీజన్‌ కోసం 200కు పైగా ప్రముఖ బ్రాండ్‌ల నుండి దాదాపు లక్షకు పైగా సరికొత్త స్టైల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. షాపింగ్‌ అసిస్టెంట్‌ గారూఫస్‌ , అమెజాన్‌ లెన్స్‌లను ఈ కొత్త షాపింగ్‌కో రెండు ప్రధాన ఆవిష్కరణగా తీర్చిదిద్దారు. ఈ అత్యాధునిక ఏఐ సాంకేతికతతో, వినియోగదారులు తమ వ్యక్తిగత శైలిని మరింత మెరుగ్గా వ్యక్తపరిచేందుకు వేదికగా మారుతుందని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

శివ దిలీపన్‌ మృతిపై సంతాపం

అన్నానగర్‌: హిందీ లిపి తొలగింపు పోరాటంలో మే 17 ఉద్యమ సభ్యుడు శివ దిలీపన్‌ రైలు కిందపడ్డాడు. ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించారు. అతని మృతిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణ త్యాగాలు మళ్లీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరారు. చైన్నె పార్క్‌ రైల్వే స్టేషన్‌లో హిందీ ముద్రణకు వ్యతిరేకంగా మార్చి 1వ తేదీన నిరసన జరిగింది. మే 17 ఉద్యమంలో ప్రముఖ సభ్యుడైన శివ దిలీపన్‌ హిందీ నశించాలి, తమిళం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ వస్తున్న రైలుకు అడ్డంగా దూకాడు. అతను తీవ్రంగా గాయపడడంతో వెంటనే చైన్నెలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేర్చారు. ఆయన వారం రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్నారు. గురువారం మృతి చెందాడు. శివ దిలీపన్‌ మృతిపై ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ప్రచురించిన ఒక పోస్ట్‌లో ముఖ్యమంత్రి తీవ్ర విచారంతో ఇలా పేర్కొన్నారు. భాషా యుద్ధంలో కోల్పోయిన ప్రాణాలు చాలు, ఇక ఒక్క ప్రాణం కూడా పోకూడదన్నారు. శివ దిలీపన్‌ మరణం హృదయ విదారకమని, శాంతియుత మార్గంలో నిరసన కొనసాగించవచ్చునని తెలిపారు. శివ దిలీపన్‌ మరణంతో దుఃఖంలో ఉన్న ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలకు, మే 17 ఉద్యమ సమన్వయకర్త తిరుమురుగన్‌ గాంధీతో సహా ఆయన సహచరులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

రౌడీషీటర్‌ ఆత్మహత్య

తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 16 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీషీటర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు సమీపంలో జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఎంజీఆర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన శరవణన్‌. ఇతడికి సుమిత్రదేవి అనే భార్యతోపాటు పిల్లలు ఉన్నారు. శరవణన్‌పై తిరువళ్లూరు టౌన్‌, తాలూకా, కడంబత్తూరు, మప్పేడు తిరునిండ్రవూరు, సెవ్వాపేట తదితర పోలీసుస్టేషన్లలో హత్యాయత్నం, చోరీ, చైన్‌స్నాచింగ్‌తో పాటు 16 వేర్వేరు కేసులు ఉన్నాయి. శరవణన్‌కు అదే ప్రాంతానికి చెందిన దేవి అనే మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. దేవితో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఆము ఇద్దరు కుమార్తెలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నుంచి విడుదలైన క్రమంలో దేవితో మళ్లీ అక్రమ సంబంధం కొనసాగించాలని ఆమెను వేధించినట్టు సమాచారం. సంబంధాలను కొనసాగించడానికి దేవి ఇష్టపడకపోడంతో ఆమైపె కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ కేసులో శరవణన్‌ కోసం గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని చెరువు కరకట్ట వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై భార్య సుమిత్రదేవి పోలీసులను కలిసి తన భర్త ఆత్మహత్యకు దేవి, ఆమె బంధువులు ఇళయరాజ, కుమరన్‌ తదితరుల వేధింపులే కారణమని ఫిర్యాదు చేశారు. తన భర్త నుంచి సుమారు మూడు లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారని, ఇవ్వని పక్షంలో హత్య చేస్తామని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు వాపోయారు. పోలీసులు మృతుడి ఆత్మహత్య కేసును ప్రత్యేకంగా భావించి దర్యాప్తును చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement