నేలకొరిగిన మర్రిచెట్టు | - | Sakshi
Sakshi News home page

నేలకొరిగిన మర్రిచెట్టు

Mar 20 2026 10:17 AM | Updated on Mar 20 2026 10:17 AM

● పళ్లిపట్టు–షోళింగర్‌ రోడ్డు మార్గంలో రెండు గంటల పాటు ట్రాఫిక్‌

నేలకొరిగిన చెట్టు

పళ్లిపట్టు: పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో గురువారం వేకువజామున ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి భారీ మర్రిచెట్టు నేలకూలింది. దీంతో పళ్లి పట్టు–షోళింగర్‌ రోడ్డు మార్గంలో రెండు గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించి వాహన చోదకులు ఇబ్బ ందులు ఎదుర్కొన్నారు. వేసవి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నాయి. పగటి సమయాల్లో ఉష్ణోగ్రతలు సైతం పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా రు. ప్రధానంగా వాహన చోదకులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గురువారం వేకువజామున తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో ఉరుములు పెరుపులతో గాలీవానతో పాటు వర్షం కుమ్మరించింది. దాదాపు అర్ధగంటపాటు కురిసిన వానకు వాతావరణ కాస్తా చెల్లబడి చల్లటి గాలి వీయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అదేసమయంలో అత్తిమాంజేరిపేట సమీపంలోని తొట్టికండ్రిగ వద్ద ఎండిన మర్రిమాను నేలకొరిగింది. ఆ సమయంలో వాహన చోదకులు అటువైపు ప్రయాణం చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రాష్ట్ర రహదారికి మధ్యలో మాను నేలకూలడంతో వాహన సేవ స్తంభించింది. రెండు గంటలపాటు వాహనాలు స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. అనంతరం పళ్లిపట్టు హైవేశాఖ అధికారులు జేసీబీ తీసుకొచ్చి మాను రోడ్డు నుంచి తొలగించడంతో రెండు గంటల తరువాత వాహన సేవలు పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement