తిరుత్తణి: కంచిలో పట్టుచీరలు కొనుగోలుకు కు టుంబీకులతో వెళ్లుతుండగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టి రూ.మూడు లక్షలు స్వాధీ నం చేసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాహన తనిఖీలు ము మ్మరంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆంధ్రాలోని పలువురికి ఎన్నికలకు సంబంధించి అవగాహన లేకపోవడంతో చైన్నె, కాంచీపురానికి వెళ్లుతున్న వారి వద్ద తనిఖీలు పేరిట అధికారులు డబ్బులు స్వాధీనం చేస్తున్నారు. దీంతో ఆంధ్రాకు చెందిన బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పళ్లిపట్టులో చిత్తూరు జిల్లా బాలకృష్ణాపురానికి చెందిన ప్రకాష్‌నాయుడు అనే వ్యక్తి నుంచి రూ.1.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గురువారం ఉదయం తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని పొన్పాడి వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. కారులో తిరుపతి నుంచి తిరుత్తణి వైపు వెళ్లిన వ్యక్తుల నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకుని ఆర్డీఓ కార్యాలయంలో అప్పగించారు. విచారణలో తిరుపతికి చెందిన రామూర్తి అనే వ్యక్తి కుమారుడి వివాహం కోసం కంచిలో పట్టు చీరలు కొనుగోలు కోసం కుటుంబంతో వెళ్లుతుండగా డబ్బులకు రికార్డులు లేవని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యాపారులు, వస్తువులు కొనుగోలు కోసం వెళ్లేవారు నగదుకు సంబంధించి రికార్డులతో పయనించాలని, అవగాహన లేకుండా తమిళనాడులో ప్రవేశిస్తే డబ్బులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
అదుపుతప్పిన లగ్జరీ బస్సు
అన్నానగర్: కారైకుడి నుంచి చైన్నె వైపు మయిలం సమీపంలో డ్రైవర్ నడుపుతున్న విలాసవంతమైన బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కారై కుడి నుండి చైన్నె వైపు ఓ ప్రైవేట్ విలాసవంతమై న బస్సు వెళుతోంది. ఆ బస్సును అరందాంగికి చెందిన సాహుల్(35) నడిపాడు. గురువారం తెల్లవారుజామున మైలాడుదురై సమీపంలోని కేనిప ట్టు వద్ద ఈ విలాసవంతమైన కారు వెళుతోంది. ని ద్రమత్తులో ఉన్న డ్రైవర్ బస్సుపై నియంత్రణ కో ల్పోయి, దానిని రోడ్డు పక్కకు నడపడంతో ప్రమా దం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయా ణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యా యి. అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయంపై సమాచారం అందు కున్న తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న మయి లం పోలీసులు, ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


