సాక్షి, చైన్నె: క్రికెట్ బ్రాండ్ సిక్సిట్ తన తదుపరి ప్రణాళికను ప్రకటించింది. టెన్నిస్–బాల్ క్రికెట్ సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఈ సంస్థ, తాజాగా క్రికెట్ ఎక్విప్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. రూ.125 కోట్ల బ్రాండ్ విలువ కలిగిన సిక్సిట్, రాబోయే మూడేళ్లలో రూ.300 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా టీమ్ ఇండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను నియమించుకుంది. క్రికెట్ బాల్ కేటగిరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా తనను నియమించిన సందర్భంగా అర్ష్‌దీప్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి క్రికెటర్ తన ప్రయాణాన్ని గల్లీల్లో టెన్నిస్ బాల్‌తోనే ప్రారంభిస్తాడని పేర్కొంటూ, అట్టడుగు స్థాయి క్రికెట్‌తో విడదీయలేని బంధం ఉన్న సిక్సిట్ వంటి బ్రాండ్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంద్ఙి అని తెలిపారు. ఇప్పటివరకు టెన్నిస్ బాల్స్‌కు పరిమితమైన సిక్సిట్, తాజాగా తన పోర్ట్‌పోలియోను విస్తరిస్తూ కొత్త ఉత్పత్తులుగా క్రికెట్ కిట్లు, బ్యాట్లు, లెదర్ క్రికెట్ బాల్స్, క్రికెట్ ఫుట్‌వేర్, జెర్సీలను సిద్ధం చేసినట్టు ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ భరత్ సింగ్, సేల్స్ హెడ్ భవాని లఖాని పేర్కొన్నారు. మదురైలో అత్యాధునిక తయారీ కేంద్రం ద్వారా సిక్సిట్ తన ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు, ఇక్కడ వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.


