సేలం: తమిళనాడులో ప్రైవేట్ వెటర్నరీ కళాశాలల కు ప్రవేశం కల్పించే ప్రయత్నాన్ని ప్రభుత్వం విర మించుకోవాలని డిమాండ్ చేస్తూ నామక్కల్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ తమిళనాడులో ప్రస్తుతం 7 పశువైద్య కళాశాలలు నడుస్తున్నాయని, రాష్ట్రంలో ప్రతి ఏడాది 680 మంది పశువైద్య పట్టభద్రులు అవుతారన్నారు. 20వ పశుగణన ప్రకారం, తమిళనాడులో 2.45 కోట్ల పశువులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర పశువైద్య మండలిలో 8,528 మంది పశువైద్యులు నమోదయ్యారు. 2036 నాటికి ప్రభుత్వ రంగంలో 500 పోస్టులు ఖాళీగా ఉంటా యని, ఆ సమయానికి తమిళనాడులో 10 వేల మంది పశువైద్యులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, కొత్త ప్రైవేట్ పశువైద్య కళాశాలలు ప్రారంభించడం వల్ల ఉపాధి సమస్య మరింత తీవ్రమవుతుందన్నారు. తమిళనాడు అంతటా పశుసంవర్థక శాఖ కింద పని చేస్తున్న 800 పశువైద్య శాఖ కేంద్రాలను పూర్తి స్థాయి పశువైద్య డిస్పెన్సరీలుగా అప్‌గ్రేడ్ చేయాల ని, పశుసంవర్థక రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టిం చాలని, విద్యార్థులు, పశుసంవర్థక కార్మికుల సంక్షే మాన్ని పరిగణనలోకి తీసుకుని, తమిళనాడులో ప్రైవేట్ రంగంలో పశువైద్య కళాశాలను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వొద్దని పశువైద్యులు, విద్యార్థులు సీఎం స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు.


