విమానంలో పయనం
సాక్షి, చైన్నె: విమానంలో ప్రయాణించాలన్న నిరుపేద చిన్నారుల కలను మద్రాస్ మెట్రో రౌండ్ టేబుల్ 95, మద్రాస్ మెట్రో లేడీస్ సర్కిల్ 70 సంస్థలు సాకారం చేశాయి. దీంతో చైన్నె నుంచి కోయంబత్తూర్ ఒక్కరోజు విమానంలో విహార యాత్ర చేసిన చిన్నారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఫ్లైట్ ఆఫ్ ఫాంటసీ–2026 పేరుతో జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టి్‌ంచే లక్ష్యంతో హృదయ స్పర్శ చొరవతో, రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఇండియా ఒక అనాథ శరణాలయం నుంచి 25 మంది పేద పిల్లలు మొదటిసారిగా విమాన ప్రయాణాన్ని అనుభవించే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దీంతో శుక్రవారం చైన్నె నుంచి కోయంబత్తూర్‌కు విద్యా వినోద విహారయాత్రకు తీసుకెళ్లారు. కార్యక్రమాన్ని మద్రాస్ మెట్రో రౌండ్ టేబుల్ 95, మద్రాస్ మెట్రో లేడీస్ సర్కిల్ 70, కోయంబత్తూర్ ఏ సి ఎం ఈ రౌండ్ టేబుల్ 133, కోయంబత్తూర్ పెండా రౌండ్ టేబుల్ 101 సంయుక్తంగా నిర్వహించాయి. జెమ్ హాస్పిటల్ తన మద్దతుతో కల్పించింది. రౌండ్ టేబుల్ ఇండియా సభ్యులు పర్యటన అంతటా పిల్లలతో ఉంటూ ఆనందాన్ని పంచారు., కోయంబత్తూరు చేరుకున్న తర్వాత, పిల్లలు ఆకర్షణీయమైన కార్యకలాపాలతో నిండిన వినోదభరితమైన షెడ్యూల్‌ను ఆస్వాదించారు. కార్యక్రమానికి ఇన్‌న్‌కమింగ్ ఏరియా 7 చైర్మన్ రోహిత్ రామచంద్రన్, ఏరియా 2 చైర్మన్ కరణ్‌గోయల్, మోహన్‌న్‌రాజ్, స్వరూప్‌కృష్ణ, అనిందిత పాల్గొన్నారు.


