కమనీయం..
అగ్నిగుండ మహోత్సవం
మొదటగా ఆలయ పూజారి అగ్నిగుండ ప్రవేశం
సేలం: ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయంలోని పరియూర్‌లోని కొండతుక్కళిఅమ్మన్ ఆలయంలో గురువారం ఉదయం అగ్నిగుండ మహోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు అగ్నిగుండంలో దిగి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం సింహ వాహనంలో అమ్మవారు అగ్నిగుండం దిగే స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు వందల సంఖ్యలో అగ్నిగుండ ప్రవేశం చేయడం ఆసక్తిరేపింది. 469 మంది పోలీసు భద్రతా విధులు నిర్వహించారు.
కమనీయం..
కమనీయం..


