క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jan 9 2026 7:34 AM | Updated on Jan 9 2026 7:34 AM

క్లుప

క్లుప్తంగా

అరిథ్మియా చికిత్స కోసం

3డీ టెక్నాలజీ

సాక్షి, చైన్నె: తమిళనాడులో మొట్టమొదటి సారిగా వడపళనిలోని కావేరి ఆస్పత్రిలో సంక్లిష్ట అరిథ్మియా చికిత్స కోసం అధునాతన 3 డీ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఇది సంక్లిష్ట గుండె లయ రుగ్మతలకు ఖచ్చితమైన, సురక్షితమైన చికిత్స కోసం ఎలక్ట్రోఫిజియాలజీ అధ్యయనాలకు అత్యాధునిక కార్డియాక్‌ టెక్నాలజీలకు సహాయ పడుతాయని ప్రకటించారు. ఆట్రియల్‌ ఫైబ్రిలేషన్‌, వెంటిక్యులర్‌ టాచీ కార్డియా వంటి సంక్లిష్ట అరిథ్మియాలను అధునాతన సాంకేతికతతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని గురువారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ అండ్‌ కార్డియాక్‌ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ దీప్‌ చంద్‌ రాజా వివరించారు. ఈ విధానాన్ని సినీ నటుడు ఆర్‌. శరత్‌కుమార్‌, కావేరి సహ వ్యవస్థాపకుడు అరవింద్‌ సెల్వరాజన్‌ పరిచయం చేశారు. శరత్‌కుమార్‌ మాట్లాడుతూ, అరిథ్మియా చికిత్సలో అధునాతన విధానాలకు మార్గదర్శకంగా ఇది నిలుస్తుందని వివరించారు.

చైన్నె వేదికగా

ఏఎన్‌ఎంఐ కన్వెన్షన్‌

సాక్షి,చైన్నె : అంతర్జాతీయ స్థాయి ట్రేడింగ్‌కు వేదికగా చైన్నెలో ఏఎన్‌ఎంఐ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 10వ తేదీన 15వ అంతర్జాతీయ మూల ధర మార్కెట్‌ సదస్సు, టెక్‌ , ట్రేడ్‌, ట్రస్ట్‌ ఫేషింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియామార్కెట్‌ కార్యక్రమాన్ని ఓ హోటల్‌లో నిర్వహించనున్నామని సదస్సు కన్వీనర్‌ హేమంత్‌ కక్కర్‌ తెలిపారు. ఏఎన్‌ఎంఐ నాయకత్వం నుంచి వ్యూహాత్మక దృష్టితో స్థిరమై, స్థితిస్థాపక పర్యావరణ వ్యవస్థకు నమ్మకంగా, మూల స్తంభంగా , పెట్టుబడి దారులకు విద్య, ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా ఈ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో వేదికగా నిలవనున్నట్టు తెలిపారు.

తాగునీటి

కాలుష్యంతో ఇక్కట్లు

తిరువొత్తియూరు: చైన్నె కాశీమేడులో మురుగునీరు కలవడంతో తాగునీరు కలుషితమై నల్లగా వస్తుండండంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు.. కాశిమేడు. ’బి’ బ్లాక్‌ ప్రాంతంలో 1000కి పైగా నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పైపుల ద్వారా, లారీల ద్వారా మునిసిపల్‌ కార్పొరేషన్‌ తరపున తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పైపుల ద్వారా సరఫరా చేసే తాగునీటిలో మురుగునీరు కలిసి నీరు నల్లగా, దుర్వాసనతో వస్తోంది. దీంతో ఆ నీటిని దేనికీ ఉపయోగించలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు డబ్బులు పెట్టి తాగునీటిని కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. తాగునీటిలో మురుగునీరు కలిసి వస్తున్నట్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆ ప్రాంత ప్రజలు ఆరోపించారు. దీనిపై ఆ ప్రాంతానికి చెందిన శరవణమ్మాళ్‌ అనే మహిళ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని అన్ని ఇళ్లలో తాగునీటి పైపులు ఉన్నాయి. ఎప్పుడూ నల్లగా మురుగునీరు కలిసి వస్తోంది. చాలా నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఎన్ని ఫిర్యాదులు చేసినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలోని

గృహాల కూల్చివేత

తిరుత్తణి: తిరుత్తణి రైల్వే స్టేషన్‌ సమీపంలోని శిథిలావస్థలో వున్న రైల్వే క్వార్టర్స్‌ గృహాల్లో అసాంఘిక చర్యలు చోటుచేసుకోవడంతో రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు. తిరుత్తణి రైల్వే స్టేషన్‌ నుంచి చైన్నె, తిరుపతి, ముంబాయి. తిరువళ్లూరు, అరక్కోణం సహా వివిధ ప్రాంతాలకు రోజూ పదివేలకు పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల రైల్వే స్టేషన్‌కు సమీపం రైల్వే ఉద్యోగుల వసతి గృహాల్లో 10 క్వార్టస్‌ దుస్థితికి చేరుకుని శిథిలావస్థలో ఉండడంతో అందులో ఉత్తరాది యువకుడిని బంధించి కత్తులతో దారుణంగా నరకడంతో పాటూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించడం ప్రయాణికులకు ఆందోళన కలిగించింది. అక్కడే నివాసముంటున్న కుటుంబీకులు సైతం ఆందోళన చెందారు. అసాంఘిక శక్తులు దుశ్చర్యలకు పాల్పడుతున్న క్రమంలో ప్రయాణికులకు రక్షణ, కుటుంబీకులకు స్వేచ్ఛ కల్పించే విధంగా పాత క్వార్టర్స్‌ కూల్చివేయాలని రైల్వే ఎస్పీ ఈశ్వరన్‌ అధికారులను కోరారు. స్పందించి రైల్వే అధికారులు గురువారం జేసీబీ సాయంతో దుస్థితిలో నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్న రైల్వే క్వోర్టర్స్‌ ఇళ్లు కూల్చివేశారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement