క్లుప్తంగా
సాక్షి, చైన్నె: ఆసక్తికర ఘటనలతో కూడిన డ్యూయల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్‌గా ఈనెల 9న లయన్స్ గేట్‌ప్లేలో ప్రసారం చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం,కన్నడ భాషలలో దీనిని రూపొందించామని దర్శకుడు సురేష్ సాగిరాజు, నటుఏడు వల్లభ్ తేజ పేర్కొన్నారు. డ్యూయల్ అరుదైన, భావోగ్వేంతో కూడిన చిత్రంగా వివరించారు. అదృష్టం కలిసి రావడంతో మొదలయ్యే కథ గానాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్‌గా డ్యూయల్ రూపుదిద్దుకున్నట్టు పేర్కొన్నారు.
అన్నానగర్: నైల్లె పాలైలోని యాంగోట్టైలోని శాంతినగర్ 20వ వీధికి చెందిన జెఫ్రీ డేవిడ్సన్ (30). ఇతను కార్లు కొనడం, అమ్మడం వ్యాపారం చేస్తున్నాడు. ఇతను ఎం. బి. ఎ. గ్రాడ్యుయేట్ అయిన ప్రియాంక (27)ను 6 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 5 ఏళ్ల కుమారుడు, 9 నెలల బాబు ఉన్నారు. డిసెంబర్ 31వ తేదీన ప్రియాంక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త సమాచారం ఇవ్వడంతో ఆమె బంధువులు ఆమె ఇంటికి చేరుకున్నారు. పాళయంకోట్టై పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రియాంకను రక్షించి నైల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ తీవ్ర చికిత్స పొందినప్పటికీ, ఆమె ఆదివారం విషాదకరంగా మరణించింది. దీనిపై ప్రియాంక తండ్రి తిలగరాజ్, అతని కుటుంబం పాలై యాంగోట్టై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెఫ్రీ డేవిడ్సన్ డబ్బు కోసం తమను వేధిస్తున్నాడని, తరచుగా ప్రియాంకపై దారుణంగా దాడి చేసేవాడని అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రియాంక ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు జెఫ్రీ డేవిడ్సన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం అతనిని అరెస్టు చేశారు. పోస్టుమార్టం తర్వాత పూర్తిస్థాయిలో వివరాలు తెలుస్తాయని పాడి అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ పేర్కొన్నారు.
తిరుత్తణి: తిరువలంగాడులో ఆరుద్ర అభిషేకంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. నటరాజర్ నాట్య అరంగేట్రం చేసిన ఐదు క్షేత్రాల్లో మొదటి సభ రత్న సభ కొలువైన తిరువలంగాడులోని వఠారన్నేశ్వరర్ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో తమిళ మార్గళి మాసం తిరువాతిరై నక్షత్రం సందర్భంగా నటరాజస్వామికి ఆరుద్ర అభిషేకం నిర్వహించడం పరిపాటి. ఆలయ స్థల వృక్షం మర్రిచెట్టు కింద భాగంలో ఆరుద్ర మండపంలో ఆరుద్ర అభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. నటరాజర్‌కు విభూది అభిషేకంతో ఆరుద్ర ప్రారంభమై రాత్రంతా సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పాలు, పెరుగు, పన్నీరు, సహా 36 అభిషేకాలు చేపట్టి మహాదీపారాధన చేసారు. ఈ సందర్భంగా భక్తులు శివనామస్మరణతో స్వామిని దర్శించుకున్నారు. వఠారన్నేశ్వరర్ విశేష అలంకరణలో కటాక్షించారు. భక్తుల సౌకర్యర్థ్యం తిరువళ్లూరు. చైన్నె, అరక్కోణం, తిరుత్తణి పరిసర ప్రాంతాల నుంచి అదనపు బస్సు సేవలు నడిపారు. డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.
సాక్షి, చైన్నె: గత సంవత్సరంతో పోల్చితే రబీలో రైతుల మనో భావాలు ఉత్సాహంగా ఉన్నాయని, ఆశాజనకంగా పంటల భవిష్యత్తు, వినూత్న యంత్రాల ద్వారా నడిచే స్థిరమైన వృద్ధిని సూచించడం లక్ష్యంగా 2026లో ముందుకెళ్తున్నామని ఇంటర్నేషనల్ ట్రాక్టర్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ తెలిపారు.2025లో నంబర్ 1 ట్రాక్టర్ ఎగుమతి బ్రాండ్‌గా పేరు గడించిన సోనాలికా ట్రాక్టర్స్ శక్తివంతమైన గరిష్ట స్థాయి గురించి స్థానికంగా ఆదివారం ప్రకటించారు. డిసెంబరులో 12,392 ట్రాక్టర్లను రైతుల ముంగిటకు తీసుకెళ్లి రికార్డులను బద్దలు కొట్టే విధంగా 2025 సంవత్సరాన్ని ముగించామని వివరించారు. కొత్త మైలురాళ్ల ద్వారా ముందుకు సాగుతూ, 18 లక్షల మందికి పైగా రైతులకు ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్ధారించే విధానంతో కూడిన హెవీ డ్యూటీ ట్రాక్టర్లను తయారు చేయడం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. విస్తతమైన ఛానల్ భాగస్వామి నెట్ వర్క్‌తో కలిసి ఆన్ ఫీల్డ్ సామర్థాన్ని పెంచే అధునాతన ట్రాక్టర్లను సకాలంలో తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 2026 సంవత్సరం స్థిరమైన భవిష్యత్తును రైతులకు నిర్మించడంలో శక్తి నిచ్చే సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ వృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
బాలికకు లైంగిక వేధింపులు
తిరువొత్తియూరు: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆటోడ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. చైన్నె టీనగర్ సౌత్‌బాగ్ రోడ్డు ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక నందనంలోని చిన్నాన్న ఇంటికి ఆడుకోవడానికి వెళ్లింది, తిరిగి ఇంటికి వస్తుండగా నందనం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ బాలికను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆటోడ్రైవర్ నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి తల్లికి చెప్పింది. ఆమె తేనాంపేట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


