ఈ పొంగల్ అన్నా తమ్ముళ్లది!
తమిళసినిమా: శివకార్తికేయన్‌గా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పరాశక్తి డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ నిర్మించిన ఈ చిత్రంలో రవి మోహన్, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. జనవరి 9న విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ చిత్రం విడుదల కానుంది. పరాశక్తి చిత్ర ఆడియో కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. శివకార్తికేయన్ మాట్లాడుతూ చిత్ర విడుదల గురించి నిర్మాత ఆకాష్‌తో దీపావళికి లేదా అక్టోబర్‌లో విడుదల చేద్దామని మాట్లాడుకున్నాం. అయితే విజయ్ నటించిన చిత్రం అక్టోబర్‌లో తెరపైకి రానుందని దీంతో పొంగల్ కు వేరే చిత్రం లేకపోవడంతో మనం పొంగల్‌కు వద్దామని ఆకాష్ చెప్పారు. అయితే కొన్ని రోజుల తర్వాత విజయ్ నటిస్తున్న జననాయకన్ చిత్రం పొంగల్‌కు విడుదల అనే ప్రకటన వెలువడింది. వెంటనే నిర్మాత ఆకాష్‌తో మాట్లాడారు ఆయన పొంగల్ సందర్భంగా పది రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి రెండు చిత్రాలు విడుదల చేయొచ్చన్న అని చెప్పారు. అయితే విజయ్ మేనేజర్ జగదీష్‌కు ఫోన్ చేసి జననాయకన్ విడుదలను పొంగల్‌కు మార్చారా అని అడిగాను, మార్చినట్లు ఆయన చెప్పారు. అందుకు ఆయన రెండు చిత్రాలు విజయం సాధిస్తాయి. మీరు విడుదల చేయండి అని చెప్పారు. ఆ తర్వాత విజయ్‌తో అన్ని విషయాలు మాట్లాడాను. నాకు విజయ్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్ అన్నా తమ్ముళ్లది అని శివకార్తికేయన్ అన్నారు.


