వేలూరు, తిరువణ్ణామలైలో ప్రదోష పూజలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో తమిళ ఐపసి మాస ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. అంతకు ముందు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలచే మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి కాయ కూరలు, పుష్పాలంకరణ చేపట్టారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోహర నామ స్మరణాల మధ్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామి వార్లును అధికార నంది వాహణంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాలోని శివాలయాల్లోని నంది భగవాన్‌కు పూజలు చేశారు.


