మరో శాండిల్ వుడ్ నాయకి
కోలీవుడ్‌కు
తమిళసినిమా: సినిమా ఇప్పుడు పాన్ వరల్డ్‌గా మారిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వారణాసి చిత్రం ద్వారా టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఇక దక్షిణాది నటీమణులు అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. కన్నడ భామలు అన్ని భాషల్లోనూ పాగా వేస్తున్నారు. అలా తాజాగా మరో కన్నడ నటి దీప్షిక చంద్రన్ కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చారు. ప్రతిభ , సిన్సియారిటి, ఆకర్షణీయమైన నగుమోము, శ్రమించే గుణం అంటూ సినిమాకు కావలసిన అన్నీ కలిగిన బ్యూటీ ఈమె. నటుడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన ద్విభాషా (కన్నడం, తమిళం) చిత్రం మార్క్ లో దీప్షిక కథానాయికగా నటించారు. ఈ చిత్రం నూతన సంవత్సరం సందర్భంగా గురువారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా మార్క్ చిత్రంలో నటించిన అనుభవాన్ని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పంచుకున్నారు. ‘‘ నాపై నమ్మకంతో నా ప్రతిభకు అవకాశం కల్పించిన నిర్మాత సత్యజ్యోతి ఫిలిమ్స్ త్యాగరాజన్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు విజయ్ కార్తీకేయన్ తెలివైన సూచనలు ఈ చిత్రంలోని పాత్రలో నా ప్రతిభను నిరూపించుకోవడానికి దోహదం చేశాయి.అదే విధంగా నటుడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా అందించిన ప్రోత్సాహం, సహకారం నాకు అవసరమైన ఆత్మ విశ్వాసాన్ని కలిగించాయి. మార్క్ చిత్రం భావోద్వేగంగానూ, క్రియేటివ్‌గా ప్రేక్షకులకు సంపూర్ణ చిత్రంగా ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాలని కోరుకుంటున్నా. ఈ భామ అర్థవంతమైన కథాపాత్రలే తారలను నెక్స్‌ట్ లెవెల్‌కు తీసుకు వెళ్తాయనే అభిప్రాయాన్ని దీప్షిక వ్యక్తం చేశారు.
నటి దీప్షిక


