జీఎస్‌డీపీలో నెంబర్‌– | - | Sakshi
Sakshi News home page

జీఎస్‌డీపీలో నెంబర్‌–

Dec 14 2025 8:43 AM | Updated on Dec 14 2025 8:43 AM

జీఎస్‌డీపీలో నెంబర్‌–

జీఎస్‌డీపీలో నెంబర్‌–

● 16 శాతం వృద్ధి ● దేశంలో తొలి స్థానంలో తమిళనాడు ● సీఎం ఎంకే స్టాలిన్‌ వెల్లడి

సాక్షి, చైన్నె : 2021లో డీఎంకే ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా కట్టడే లక్ష్యంగా విస్తృతంగా శ్రమించారు. వైద్య సేవలను మెరుగు పరిచారు. కరోనాను నిర్ములించారు. అయితే, ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారడంతో ప్రత్యేక సలహా కమిటీని ఏర్పాటు చేసుకుని ఆచీ తూచి అడుగులు వేస్తూ క్రమంగా ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల అమలుపై సీఎం స్టాలిన్‌ దృష్టి పెట్టారు. క్రమంగా ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం అంటూ పారిశ్రామికంగా, ఆర్థికంగా, ప్రగతి పరంగా దూసుకెళ్లడం మొదలెట్టారు. దీంతో సింగిల్‌ డిజిట్‌లో ఉన్నరాష్ట్ర జీడీపీ ఇటీవల 11.19 శాతానికి చేరింది. 14 సంవత్సరాల అనంతరం ఈ ఘనతను రాష్ట్రం సాధించింది. మళ్లీ అధికారం దిశగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకెళ్తున్న ద్రావిడమోడల్‌ పాలనకు మరో కిరీటంగా జీఎస్‌డీపీ వృద్ధి రికార్డు స్థాయిలో పెరగడం విశేషం.

రికార్డుల స్థాయిలో జీఎస్‌డీపీ

సీఎం ఎంకే స్టాలిన్‌ శనివారం ఉదయాన్నే ఎక్స్‌ పేజీలో ట్వీట్‌ చేశారు. తమిళనాడు రికార్డు స్థాయిలో 16 శాతం జీఎస్‌డీపీ వృద్ధిని సాధించిందన్న శుభవార్తను ప్రకటించారు. దేశంలో ప్రధాన రాష్ట్రా కంటే తమిళనాడు ముందడుగు వేసి నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా జీఎస్‌డీపీలో అవతరించిందన్నారు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ఈ ప్రకటన ఆధారంగా సీఎం స్టాలిన్‌కొన్ని వ్యాఖ్యలు చేశారు. విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రం కాదు, జనాభా పరంగా కూడా పెద్ద రాష్ట్రం కాదు, కేంద్రం నుంచి పెద్దగా మద్దతు కూడా లేదు.. అయినా తమిళనాడు 16 శాతం జీఎస్‌డీపీ సాధించి నంబర్‌ వన్‌ స్థానాన్ని అధిరోహించడం ద్రావిడ మోడల్‌ ప్రభుత్వ ఘనతగా పేర్కొంటూ ధీమా వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా స్థిరంగా ఉన్నప్పటికీ చాలా ఎక్కువ అభివృద్ధిని సాధించామని, ఇది తాము విడుదల చేసిన ప్రకటన కాదని, స్వయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ప్రకటన అని వివరించారు. 2021–2025 ఆర్థిక సంవత్సరాల్లో 10.5 లక్షల కోట్ల నుంచి తమిళనాడు 31.19 లక్షల కోట్లకు చేరిందని ప్రకటించారు. తమిళనాడుతో పోల్చితే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాలను అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా గుర్తు చేశారు. వీటిని అధిగమించి తాము ఈ రేటును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నా. తలసరి ఆదాయం పెరుగుదల పరంగా తమిళనాడు విజయ పరంపర కొనసాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. 2031ద్రావిడ మోడల్‌ 2.ఓ పాలన ముగింపు దశకు చేరిన సమయంలో తమిళనాడు అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉండడం ఖాయం అని స్పష్టం చేశారు.ఆ మేరకు శ్రమిస్తాం, తమిళనాడును ఉన్నత స్థాయంలో కూర్చోబెట్టే విధంగా ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతామన్నారు.

ద్రావిడ మోడల్‌ ప్రభుత్వ ప్రగతిని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లే రీతిలో పార్టీ పరంగా కార్యక్రమాలను సీఎం స్టాలిన్‌ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం తిరువణ్ణామలైలలో యువజన విభాగం ఉత్తర మండల కార్యనిర్వాహకుల భేటీ జరగనుంది. ఇందుకు కేడర్‌ను ఆహ్వానిస్తూ వీడియోను విడుదల చేశారు. ద్రావిడ కుటుంబ వారసులకు అంటూ ఆదివారం యువజన నేత ఉదయనిధి స్టాలిన్‌ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీ గురించి వివరిస్తూ, 45 సంవత్సరాల క్రితం యువజన విభాగాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలను గుర్తు చేశారు. తమిళనాడు హక్కుల కోసం, తమిళ అభ్యున్నతి కోసం ఒక గొప్ప చారిత్రక పని అన్నది వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశానికి 91 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షా 30 వేల మంది హాజరు అవుతున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. యువజనుల మద్దతుతో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో దూసుకెళ్దామని పిలుపు నిచ్చారు.

కేడర్‌కు

ఆహ్వానం

స్తూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో దేశంలోనే తమిళనాడు నెంబర్‌–1 స్థానాన్ని అధిరోహించిందని సీఎం ఎంకే స్టాలిన్‌ తెలిపారు. 2021 నుంచి 2025 వరకు జీఎస్‌డీపీ వృద్ధిని 16 శాతం సాధించామని ప్రకకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement