
పార్కులో మందుబాబుల వీరంగం
పళ్లిపట్టు: పట్టణంలోని పార్కులో మందుబాబులు వీరంగం సృష్టించి గేటు, శ్లాబు కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. పళ్లిపట్టులోని షోళింగర్ రోడ్డు మార్గంలో ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాల సమీపంలో టౌన్ పంచాయతీ ఆధ్వర్యంలో పార్కు ఏర్పాటు చేసి, పట్టణ ప్రజలు వాకింగ్, సేద తీరేందుకు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా చెట్లు పెంచి అందంగా ముస్తాబు చేశారు. ఇటీవల పార్కులో రాత్రి సమయాల్లో మందు బాబులు మద్యం సేవించి ఖాళీ సీసాలు వేయడంతోపాటు చెత్తా చెదారం విచ్చలవిడిగా వేసి వెళ్లడంతో టౌన్ పంచాయతీ సిబ్బంది పార్కు గేటుకు రాత్రి సమయాల్లో తాళం వేశారు. దీంతో మందు బాబులు తాగేందుకు వీలు కాకపోవడంతో శుక్రవారం ఆగ్రహంతో పార్కు ఇనుప గేటు,శ్లాబు కూల్చి పార్కులో మద్యం బాటిళ్లు పగులగొట్టి వీరంగం సృష్టించడాన్ని గుర్తించిన స్థానికులు టౌన్ పంచాయతీ కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. పార్కును ధ్వంసం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు టౌన్ పంచాయతీ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ ఈసందర్భంగా తెలిపారు.
కూల్చివేసిన పార్కు గేటు
ధ్వంసం చేసిన శ్లాబ్

పార్కులో మందుబాబుల వీరంగం