
నూతన ఐటీఐ కళాశాల ప్రారంభం
తిరువళ్లూరు: తిరువళ్లూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ఐటీఐ కళాశాలను కలెక్టర్ ప్రతాప్, ఎమ్మేల్యే వీజీ రాజేంద్రన్ సోమవారం ఉదయం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 173.86 కోట్లు వ్యయంతో 19 నూతన ఐటిఐ కళాశాలను ప్రారంబించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరులో నూతన కళాశాల ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబించారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు ప్రారంభించిన కళాశాలలో కలెక్టర్, ఎమ్మేల్యే జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంబించిన ఐటీఐ కళాశాలలో ప్రతి సంవత్సరం 172 మందికి అడ్మిషన్‌లు కల్పిస్తామన్నారు. మెకానిక్, ఎలక్ట్రికల్స్, ప్లంబింగ్, పిట్టర్‌తో సహా ఆరు విభాగాలు వున్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి అర్హత ఆధార ంగా 14 నుంచి 40 ఏళ్లలోపు వున్న సీ్త్రపురుషులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.