దళపతి విజయ్‌పై కేసు పెట్టిన ఫ్యాన్‌ | Viral Fan Filed Case Against Actor Vijay and His Bouncers | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. దళపతి విజయ్‌పై కేసు పెట్టిన ఫ్యాన్‌

Aug 27 2025 10:10 AM | Updated on Aug 27 2025 10:10 AM

Viral Fan Filed Case Against Actor Vijay and His Bouncers

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కగళం(TVK) అధినేత విజయ్‌కు ఓ అభిమాని షాకిచ్చాడు. మధురై మహనాడులో తనపై విజయ్‌ బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆయన అభిమానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యక్తిగత సిబ్బందితోపాటు విజయ్‌పైనా కేసు నమోదు అయ్యింది.

ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్‌ (Actor Vijay)పై కేసు నమోదైంది. ఆగస్టు 21వ తేదీన మదురై పరపతిలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్‌ అనే అభిమాని ఫిర్యాదు చేశారు. సభ ప్రారంభ సమయంలో వేదికపై  విజయ్‌ వేదిక మీద నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. ఆ సమయంలో.. 

కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయ్‌ నడుస్తున్న వేదికపైకి ఎక్కి హల్‌చల్‌ చేశారు. ఈ క్రమంలో.. విజయ్‌కు దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తిని బౌన్సర్లు ఎత్తి స్టేజ్‌ అవతల పారవేసే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ అతను కింద పడలేదు. ఆ సమయంలో విజయ్‌ సైతం తన బౌన్సర్లను కాస్త తగ్గమంటూ సైగ చేసి చూపించాడు. అయితే.. ఆ యువకుడు వేదికకు ఉన్న పైప్‌ను పట్టుకుని వేలాడి కిందకి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలోనూ ట్రోలింగ్‌ రూపేణా విపరీతంగా వైరల్‌ అయ్యింది. 

 

 దీంతో మనస్తాపం చెందిన శరత్‌.. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకొన్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్‌, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ‘‘నేను ఆయన్ని చూసేందుకు వచ్చా. కానీ, ర్యాంప్‌ నుంచి నన్ను కిందకు తోసేశారు. నాకు గాయాలయ్యాయి. ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను’’ అని శరత్‌ తన తల్లితో సహా మీడియాతో మాట్లాడాడు. ఫిర్యాదు ఆధారంగా విజయ్‌, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

 

ఇదీ చదవండి: స్టాలిన్ అంకుల్.. వెరీ వెరీ రాంగ్ అంకుల్! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement