
చెన్నై: తమిళనాడులోని(Tamil Nadu) కరూర్(Karur Stampede) ఘటన తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కరూర్ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందని టీవీకే మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే నేతల ఆరోపణలకు మరింత ఆజ్యం పోస్తూ.. బీజేపీ(BJP Party) నాయకురాలు, సినీ నటి కుష్బు సుందర్(Khusbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
కరూర్ తొక్కిసలాట ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్ స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ..‘తమిళనాడు ప్రజలందరూ కరూర్ తొక్కిసలాట ఘటన నిర్లక్ష్యంగా జరిగిందని అనుకుంటున్నారు. కానీ, ఈ ప్రమాదం ప్లాన్ ప్రకారమే ఎవరో సృష్టించినట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే విజయ్(TVK Vijay) ర్యాలీ నిర్వహించడానికి ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వలేదు. విజయ్ ర్యాలీకి ఎంత మంది అభిమానులు, ప్రజలు వస్తారు అనేది ప్రభుత్వానికి, పోలీసులకు ముందే తెలుసు. అయినా కూడా ఇలా ర్యాలీకి తగిన స్థలం కేటాయించలేదు.
VIDEO | Chennai: “Tamil Nadu CM MK Stalin should switch from mute mode, speak on Karur stampede”, says actor and BJP leader Khushbu Sundar (@khushsundar) raising questions on various viral videos of Karur tragedy.#KarurStampede
(Full video available on PTI Videos -… pic.twitter.com/Fm587TeDvf— Press Trust of India (@PTI_News) October 4, 2025
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన జరిగిన తర్వాత మౌనంగా ఉన్నారు. పలు ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు?. ఈ దురదృష్టకర ఘటనలో 41 మంది మరణించారు. ఇప్పటికైనా స్టాలిన్ మాట్లాడాలి. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారని అధికారులు చెబుతున్నారు. అలా లాఠీఛార్జ్ ఎందుకు చేశారు?. ఇది ప్రణాళికాబద్ధంగా సృష్టించబడిన ఘటన అయి ఉండాలి’ అని ఆరోపించారు.
విజయ్‌కు బీజేపీ అగ్రనేత ఫోన్..
మరోవైపు.. కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. తాజాగా టీవీకే విజయ్‌తో బీజేపీ అగ్రనేత ఒక్కరు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్‌కు సూచించినట్లు సమాచారం.
సమీకరణం.. మారేనా?
వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్‌గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.