
ప్రేమంటే ప్రపంచ భాష
మైల్స్ చిత్రంలో నిర్ణాతో
అశోక్ సెల్వన్
తమిళసినిమా: అశోక్‌సెల్వన్, మిర్ణా జంటగా నటిస్తున్న చిత్రం 18 మైల్స్. సతీష్‌సెల్వకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి కె.ఎళిల్‌అరసు చాయాగ్రహణం, సిద్ధుకుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విచిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేశారు. చక్కని ప్రేమ కావ్యంతో కూడిన ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సతీష్‌సెల్వకుమార్ చిత్రం గురించి మాట్లాడుతూ 18 మైళ్ల దూరంలో ఆకాశం ఒకేలా ఉండవచ్చునని ,అయితే జీవితం మాత్రం ప్రతిరోజూ అంతం లేని సముద్రంలో ప్రశాంతత, ఎదురీత, చెప్పలేని ప్రేమ వంటి విషయాలతో కూడుకుందని అన్నారు. ఈ విషయాలను తెరపై ఆవిష్కరించే కథా చిత్రమే 18 మైల్స్ అని చెప్పారు. ప్రేమ అనేది ప్రపంచ భాష అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు అయితే సరిహద్దుల్లోనూ, అంతర్జాతీయ పరిస్థితులు ప్రేమకు ఇంకా హద్దుగానే ఉన్నాయన్నారు. ఇలాంటి ఒక అంతర్జాతీయ సంఘటనను ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అశోక్‌సెల్వన్ మిర్ణా కలిసి నటిస్తున్న ఇందులో విషయాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయన్నారు. వీటన్నిటికీ మించి అశోక్‌సెల్వన్, మిర్ణాల ప్రేమ కాలాన్ని అధిగమించి వారి మౌనం కవితాత్మకమైన భావనలు , సంగీతంలోని చివరి రిథం వరకు ఇందులోని పాటలు మాధుర్యాన్ని ఆస్వాదించ వచ్చునని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఈ చిత్రంలో లీనం అవుతారనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.