క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 24 2025 7:45 AM | Updated on Aug 24 2025 7:45 AM

క్లుప

క్లుప్తంగా

జనావాసంలోకి జింక పిల్ల

అన్నానగర్‌: మనలిలోని బర్మానగర్‌ సమీపంలో శనివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి ఒక చుక్కల జింక పిల్ల నివాస ప్రాంతంలోకి వచ్చింది. వీధికుక్కలు చూసి జింక పిల్లను వెంబడించి కరవడంతో స్వలంగా గాయపడింది. ఆ ప్రాంత నివాసి అనిల్‌ ప్రసాద్‌ వీధి కుక్కలను తరిమి, స్థానికుల సాయం జింక పిల్లను రక్షించి సాత్తంగాడు పోలీసులకు అప్పగించారు. పోలీసులు జింక పిల్లకు ప్రథమ చికిత్స అందించి అటవీశాఖకు అప్పగించారు.

ఇనుప గోడౌన్‌లో అగ్నిప్రమాదం

అన్నానగర్‌: పాత ఇనుప గోడౌన్‌లో భారీ అగ్పిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రూ.లక్షల విలువ చేసే పాత వస్తువులు కాలిపోయాయి. చైన్నెలోని ఓల్డ్‌ వాషర్‌మన్‌పేటలోని పెరంబలు వీధికి చెందిన బోస్‌ (64). ఇతను పాత ఇనుప సామగ్రి, పాత కాగితాలు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.అదేప్రాంతంలో దీనికి సంబంధించిన గోడౌన్‌ ఉంది. ఈ గోడౌన్‌లో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటల్లో ప్లాస్టిక్‌ వస్తువులు, కాలి గోడౌన్‌ అంతటా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న తండయార్‌పేట్‌ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే మంటల్లో లక్షల విలువ చేసే వస్తు వులు కాలిపోయాయి. వాషర్‌మన్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అద్దె ఇంట్లో వ్యభిచారం

–మహిళ అరెస్ట్‌

తిరువొత్తియూరు: చైన్నె విల్లివాక్కంలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతున్న ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె పోలీసులకు అందిన సమాచారం మేరకు, శుక్రవారం మధ్యాహ్నం విల్లివాక్కం, శెట్టితోపు వీధిలోని ఒక ఇంట్లో వారు తనిఖీ చేశారు.ఆ సమయంలో అక్కడ వ్యభిచారం నడుస్తున్నట్లు గుర్తించారు. మహిళలతో వ్యభిచారం నడిపిస్తున్న అంబత్తూర్‌ టీచర్స్‌ కాలనీకి చెందిన అముద (33)ను ఆమెను అరెస్టు చేసి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను రక్షించారు.

55 సవర్ల నగలు చోరీ

తిరువొత్తియూరు: టీచర్‌ ఇంట్లో 55 సవర్ల నగలు, రూ.5లక్షల నగదు చోరీకి గురయ్యాయి. కృష్ణగిరి జిల్లా, పోచంపల్లి సమీపంలోని వేలంపట్టికి సమీపంలోని పాలేగుళి గ్రామానికి చెందిన ఆనందన్‌. ఇతను వేలంపట్టిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తమిళ టీచర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్లాడు. ఆసమయంలో ఇంట్లో వున్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా పగులగొట్టి అందులో ఉన్న 55 సవర్ల బంగారు నగ లు, రూ.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే ఆనంద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

పళ్లిపట్టు: వడకుప్పంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రం శనివారం ప్రారంభమైంది. స్వర్ణవారి సీజన్‌ ప్రారంభంతో తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ ప్రతాప్‌ ఆదేశించారు. దీంతో పళ్లిపట్టు మండలంలో నొచ్చిలి, వడకుప్పం, బొమ్మరాజుపేట ప్రాంతాల్లో వరికొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి వరి కొనుగోలు చేయనున్నారు. వరి కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తారు. వడకుప్పంలో సెంట్రల్‌ మండల డీఎంకే కార్యదర్శి బీడీ చంద్రన్‌ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల నుంచి వరి కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. దీంతో రైతులు ట్రాక్టర్ల ద్వారా దిగుబడి చేసిన వరి బస్తాలు తీసుకొచ్చి విక్రయించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రాజు, వరి కొనుగోలు కేంద్రం అధికారి మణి, రైతులు లోకేశ్వరన్‌, అప్పాస్వామి, శ్రీరాములు పాల్గొన్నారు. నొచ్చిలిలో కూడా వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.

వృద్ధురాలిపై అత్యాచారం

– నిందితుడి కోసం గాలింపు

తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని తేరువాయి కండ్రిగ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృదురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వృద్ధురాలు శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన నార్త్‌ ఇండియన్‌ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయగా, నోటిలో గుడ్డలు కుక్కి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉత్తరభారతదేశానికి చెందిన వలస కార్మికుడు అత్యాచారానికి ఒడిగట్టి వుండొచ్చని భావించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement