
వర్క్‌షాప్
సాక్షి, చైన్నె: ఇండియన్ అసోసియేషన్ ఫర్ సిమ్యులేషన్ ట్రైనింగ్ ఇన్ హెల్త్‌కేర్, తమిళనాడు నర్సులు, మిడ్ వైఫరీ అసోసియేషన్, శ్రీరామచంద్ర నర్సింగ్ విభాగం సంయుక్తంగా అంతర్జాతీయ సిమ్యులేషన్ వర్క్‌షాపును నిర్వహించారు. రోగి భద్రత, ఆరోగ్య మెరుగుకు సహకారం, నర్సుల పాత్ర వంటి అంశాల గురించి ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా యూకే ప్రతినిధి కోలెట్ లాస్ చాప్‌మన్, డాక్టర్ అని గ్రేస్ కలైమది, డాక్టర్ మక్కని పూర్వ, శ్రీరామచంద్ర వీసీ డాక్టర్ ఉమాశేఖర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌జే నళిని సిమ్యులేషన్ టెక్నాలజీ పాఠ్యాంశాలు, వైద్య విద్య, శిక్షణకు సంబంధించిన అవగాహన, ఈ సొల్యూషన్ బ్రోచర్‌లను విడుదల చేశారు.
ఈవ్ టీజింగ్ కేసులో ఇద్దరి అరెస్ఠ్
కొరుక్కుపేట: ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిని ఇద్దరు రౌడీలను పోలీసు అరెస్టు చేశారు. చైన్నె పులియాన్‌తోపులోని కన్నికాపురానికి చెందిన రాధ (50) కుమార్తె నిత్య. ఈమె రెండు రోజుల క్రితం పెంపుడు కుక్కతో కన్నికాపురంలో నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో అక్కడ వున్న ఇద్దరు వ్యక్తులు నిత్యను ఈవ్‌టీజింగ్ చేశారు. నిత్య ఈవిషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె రౌడీలిద్దరిని మందలించింది. ఈఇద్దరిలో ఒకడు కత్తితో రాధపై దాడి చేసేందుకు యత్నించాడు. స్థానికులు అడ్డు కుని రాధను రక్షించారు. ఫిర్యాదు మేరకు పులియాన్‌తోపు పోలీసులు పులియాన్‌తోపునకు చెందిన ముఖేష్, సంజన్‌లను అరెస్టు చేశారు.